అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రేపు ఉదయం 10 గంటలకు సీఐడీ ఆఫీస్ లో విచారణకు హాజరుకానున్నారు. IRR allignment మార్పు కేసులో లోకేశ్ ను A14గా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు మెమో ఫైల్ చేశారు.
కృష్ణాజలాలపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్రం తాజా విధివిధానాల జారీ నేపథ్యంలో ఈ మీటింగ్ జరిగింది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీటిపారుదల శాఖ అధికారులు, న్యాయ నిపుణులతో సీఎం జగన్ భేటీ అయ్యారు.
సీఎం వైఎస్ జగన్ ని అమెరికాలో పర్యటించిన ప్రభుత్వ విద్యార్థుల బృందం కలిసింది. అమెరికా పర్యటన వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, కొలంబియా యూనివర్శిటీ, ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్లో విద్యార్థులు పాల్గొన్నారు. త