Regional Passport Office: బెజవాడ వాసులకు గుడ్ న్యూస్.. విజయవాడ కేంద్రంగా త్వరలో రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ప్రారంభం కానుంది.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ శివ హర్ష.. ప్రస్తుతం ఉన్న పాస్ పోర్ట్ సేవా కేంద్రానికి అదనంగా విజయవాడ బందర్ రోడ్డులో రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ప్రారంభించనున్నారు.. దీనిపై రీజనల్ పాస్ పోర్టు ఆఫీసర్ శివ హర్ష మాట్లాడుతూ.. రీజనల్ పాస్ పోర్టు సేవా కేంద్రానికి రోజుకు 2 వేల అప్లికేషన్స్ వస్తున్నాయి.. కోవిడ్ తరువాత పాస్ పోర్ట్ అప్లికేషన్స్ ఎక్కువగా వస్తున్నాయని వివరించారు.. అక్టోబర్ నెల వరకు 3 లక్షల పాస్ పోర్టులు జారీ చేశామని వెల్లడించారు.. పోస్టల్, పోలీసు శాఖల భాగస్వామ్యంతో పాస్ పోర్టులు త్వరితగతిన అందచేస్తున్నాం అని పేర్కొన్నారు.
Read Also: Anushka Shetty: ఆ స్టార్ తో మాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న స్వీటీ..?
ఇక, విజయవాడ రీజనల్ ఆఫీసు కేంద్రంగానే ఇక పై పాస్ పోర్ట్ ప్రింటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు శివ హర్ష.. విజయవాడలో ఆఫీసు ప్రారంభం కావడం వల్ల త్వరగా సేవలు అందుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరో రెండు, మూడు నెలల్లోనే రీజనల్ పాస్ పోర్టు కార్యాలయం ప్రారంభిస్తాం.. గతం కంటే ప్రస్తుతం పాస్ పోర్టు సేవలు సులభతరం చేశామని వెల్లడించారు. తక్కువ సమయంలోనే పాస్ పోర్టులు అందజేస్తున్నాం అన్నారు. ఇదే సమయంలో దయచేసి ఎవరూ ఫేక్ సైట్లు, బ్రోకర్లను నమ్మొద్దు.. వారిని నమ్మి మోసపోవద్దు అని హెచ్చరించారు రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ శివ హర్ష.