ఏపీకి తాను ఎందుకు కావాలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన వివరాలు విని నివ్వెరపోయాం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అరాచక ఆంధ్ర ప్రదేశ్, అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా రాష్ట్రాన్ని మార్చినందుకు మళ్లీ రావాలా..? అని ఆయన ప్రశ్నించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకొని పోయింది అని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు. జనసేన ఎన్డీయే జట్టులో టెక్నికల్ గా మాత్రమే ఉంది.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, సీపీఐ, సీపీఎం, జనసేన పొత్తులతో ఎన్నికలకు వెళ్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు.