AP Draft Voter List Released: ఏపీలో మొత్తం 4,02,21,450 ఓటర్లు.. 13.48 లక్షల ఓట్లు తొలగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Draft Voter List Released: ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 4 కోట్లు దాటింది.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ రోజు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేసింది.. ఆ జాబితా ప్రకారం.. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,02,21,450గా ఉంది.. అందులో పురుష ఓటర్లు 1,98,31791కాగా.. మహిళా ఓటర్లు 2,0385,851 మంది ఉన్నారు.. ఇక ఓటుహక్కు కలిగిఉన్న ట్రాన్స్ జెండర్ల సంఖ్య 3,808గా ఉంది.. సర్వీస్ ఓటర్ల సంఖ్య 66,158 కాగా.. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 19,79,775 మంది ఓటర్లు ఉన్నారు.. అత్యల్పంగా అల్లూరి సీతారామారాజు జిల్లాలో 7,40,857 మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల కమిషన్ పేర్కొంది..
Read Also: T-Congress: టీకాంగ్రెస్ రెండో విడత జాబితా విడుదల
Also Read
- AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
- AP Municipal Elections: తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ గురుమూర్తి చేతిలోని నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన టీడీపీ నేతలు..!
- భారత్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ ఎస్యూవీ.. Renault Duster Hybrid లాంచ్.. ధర, ఫీచర్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
ఏపీ సీఈవో ఎంకే మీనా మీడియాతో మాట్లాడుతూ.. సీఈసీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశాం అన్నారు.. జనవరిలో విడుదల చేసిన ఓటర్ల జాబితా కంటే 2.36 లక్షల మేర ఓటర్లు పెరిగారన్న ఆయన.. డిసెంబర్ 27 వరకు క్లైమ్స్ పరిశీలిస్తారని తెలిపారు. ఇక, వచ్చే ఏడాది జనవరి ఐదో తేదీన తుది ఓటర్ల జాబితా వ్రకటిస్తాం అన్నారు. యువ ఓటర్ల నమోదు తక్కువగా ఉంది.. మరింత ఎక్కువ మంది అర్హులైన యువతను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తాం అని వెల్లడించారు.. గత ఓటర్ల జాబితా.. ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల మధ్య కాలంలో మొత్తం 13.48 లక్షల ఓట్లు తొలగించాం. గత ఓటర్ల జాబితా.. ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల మధ్య కాలంలో మొత్తం 15. 84 లక్షల ఓట్లను చేర్చాం తెలిపారు ఏపీ సీఈవో ఎంకే మీనా. కాగా, ఏపీలో ఓట్ల తొలగింపుపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధమే నడిచింది.. కేంద్ర ఎన్నికల సంఘం వరకు పోటీపోటీగా ఫిర్యాదులు చేసుకున్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
-
Double Diabetes: మీకు డబుల్ డయాబెటిస్ ఉందా?
-
Destiny : కామెడీ వదిలేసి.. అడవిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్!
-
WHO: ఇంట్లోనే విషం? 35లక్షల మరణాలకు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?