ఈ రోజు చంద్రగ్రహణం.. ఆలయాలు మూసివేత.. భారత్‌లో ఏ సమయంలో…?
చంద్రునికి సూర్యునికి మధ్య భూమి వచ్చినపుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. మన దేశ కాలమానం ప్రకారం ఇవాళ అర్థరాత్రి 1.05 నిమిషాలకు గ్రహణం ప్రారంభంకానుంది. గ్రహణ మోక్ష కాలం తెల్లవారుజామున 2 గంటల 23 నిమిషాలు. అంటే మొత్తం గ్రహణం సమయం ఒక గంట 19 నిమిషాలు. భారత్‌తో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చంద్ర గ్రహణం కనిపించనుంది. భారతదేశంతో పాటు ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలోని తూర్పు, ఉత్తర ప్రాంతాలు, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, పశ్చిమ, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో గ్రహణ ప్రభావం పడనుంది. అయితే ఇది పాక్షిక చంద్రగ్రహణమే అయినా.. గ్రహణం ప్రభావం తప్పకుండా భారత్‌పై కూడా పడబోతోందని పండితులు చెబుతున్నారు. అందుకే గ్రహణ నియమాలను పాటించాలన్నది వారి మాట. మరోవైపు గ్రహణ సమయానికి ఆరు గంటల ముందు ఆలయ తలపులు మూసివేయడం ఆనవాయితీ కావడంతో .. నేటి రాత్రి 7.05 గంటలకు తిరుమల ద్వారాలు మూసివేస్తారు. రేపు తెల్లవారుజామున ఆలయాన్ని శుద్ధిచేసి ఏకాంతసేవ నిర్వహిస్తారు. అనంతరం భక్తులను తిరిగి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఇవాళ మధ్యాహ్నం మూడున్నర వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. గ్రహణం సమయంలో శ్రీవారి ఆలయంలో ప్రసాదాల తయారీతో పాటు అన్నదానం కూడా నిలిపేస్తారు. దీని తర్వాత సెప్టెంబర్ 7, 2025 సంవత్సరంలో సంపూర్ణ చంద్ర గ్రహణం ప్రపంచ వ్యాప్తంగా కనువిందు చేయనుంది.
పాక్షిక చంద్రగ్రహణం.. ఏ రాశివారు ఎలాంటి నియమాలు పాటించాలంటే..?
ఈ రోజు చంద్ర గ్రహణం ఏర్పడనుంది.. చంద్రునికి సూర్యునికి మధ్య భూమి వచ్చినప్పుడు ఈ గ్రహణం ఏర్పడుతుంది.. భారత కాలమానం ప్రకారం ఇవాళ అర్థరాత్రి 1.05 నిమిషాలకు గ్రహణం ప్రారంభంకానుంది. గ్రహణ మోక్ష కాలం తెల్లవారుజామున 2 గంటల 23 నిమిషాలు. అంటే మొత్తం గ్రహణం సమయం ఒక గంట 19 నిమిషాలు. భారత్‌తో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చంద్ర గ్రహణం కనిపించనుంది. భారతదేశంతో పాటు ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలోని తూర్పు, ఉత్తర ప్రాంతాలు, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, పశ్చిమ, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో గ్రహణ ప్రభావం పడనుంది. అయితే ఇది పాక్షిక చంద్రగ్రహణమే అయినా.. గ్రహణం ప్రభావం తప్పకుండా భారత్‌పై కూడా పడబోతోందని పండితులు చెబుతున్నారు. అందుకే గ్రహణ నియమాలను పాటించాలని చెబుతున్నారు.. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం పౌర్ణిమకు వాల్మీకి జయంతి అనే పేరు కూడా ఉంది.. ఈ రోజు మరో విశేషం ఏంటంటే.. అదే చంద్రగ్రహణం.. అర్ధరాత్రి సమయంలో ఏర్పడుతున్న నేపథ్యంలో.. ఎలాంటి కఠిన నియమాలు పాటించాల్సిన అవసరం లేదని శాస్త్రం చెబుతుంది అంటున్నారు పండితులు.. ఇదే సమయంలో.. కొన్ని రాశులవారికి ఈ గ్రహణం అశుభ ఫలితాలను కూడా ఇస్తుందంటున్నారు.. మేషరాశి వారు ఈ గ్రహణాన్ని చూడడడానికి శాస్త్రం అంగీకరించదు.. అశ్వనీ నక్షతం వారు కూడా చూడకూడదని చెబుతున్నారు.. మేషం, వృషభం, కన్యా, మకరం రాశుల వారికి ఈ గ్రహణం అశుభ ఫలితాలను అందించబోతుంది.. గ్రహణానికి ఎలాంటి కఠిన నియమాలు లేనప్పటికీ సాయంత్రం 4 గంటల వరకు భోజనాలు పూర్తి చేసుకోవాలి.. పూర్తిస్థాయిలో అంటే రాత్రి 8 గంటల లోపు పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది..
సామాజిక సాధికార యాత్ర.. మూడో రోజు షెల్యూల్ ఇదే..
తన పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందజేసిన సంక్షేమ పథకాల ఫలాలను వివరిస్తూ.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సామాజిక సాధికార యాత్ర పేరుతో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రలు చేపట్టింది.. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర.. ఇలా మూడు ప్రాంతాల్లో ఒకేసారి యాత్రలు నిర్వహిస్తున్నారు.. డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని.. తన ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు.. అందించిన సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తున్నారు.. ఇప్పటికే రెండు రోజుల పాటు ఈ యాత్రలు విజయవంతంగా సాగగా.. మూడో రోజు షెడ్యూల్ ఇలా ఉండనుంది.. ఉత్తరాంధ్ర విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో మూడో రోజు సామాజిక సాధికార యాత్ర నిర్వహించనున్నారు.. మంత్రులు బొత్స సత్యనారాయణ, సిదిరి అప్పలరాజు, కార్మూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, విడదల రజినీ, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఇతర నేతలు పాల్గొననున్నారు.. కోస్తా రీజన్ విషయానికి వస్తే బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర జరగనుంది.. మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి పార్థసారథి, ఇతర ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొననున్నారు.. మరోవైపు రాయలసీమ రీజన్ విషయానికి వస్తే.. నేడు కడప జిల్లా ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర నిర్వహించనున్నారు.. డిప్యూటీ సీఎం అంజాద్ భాష, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, బుట్టా రేణుక, ఆకేపాటి అమర్నాథ్, ఇతర నేతలు పాల్గొన్నారు..
ఢిల్లీలోని 9 ప్రదేశాలలో విషంగా మారిన గాలి.. పీల్చితే కష్టమే
ఢిల్లీలోని తొమ్మిది ప్రాంతాల్లో గాలి శుక్రవారం చాలా పేలవమైన వర్గానికి చేరుకుంది. ఈ ప్రాంతాల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటింది. ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ప్రకారం, ఢిల్లీ ప్రజలు చెడు గాలి నుండి ఉపశమనం పొందే అవకాశం చాలా తక్కువ. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం.. ఢిల్లీలో శుక్రవారం సగటు గాలి నాణ్యత సూచిక 261. ఈ స్థాయి గాలి పేలవమైన వర్గం కిందకు వస్తుంది. గురువారం ఈ సూచిక 256గా ఉంది. అంటే 24 గంటల్లో ఐదు పాయింట్లు పెరిగింది. ఢిల్లీలోని తొమ్మిది ప్రాంతాల సూచీ శుక్రవారం 300 దాటడం ఆందోళన కలిగించే అంశం. ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ప్రకారం, వచ్చే నాలుగైదు రోజుల పాటు గాలి వాయువ్య దిశలో ఉంటుంది. గాలి వేగం గంటకు పది కిలోమీటర్ల లోపే ఉంటుందని అంచనా. దీని కారణంగా, కాలుష్య కణాల వ్యాప్తి నెమ్మదిగా ఉంటుంది. గాలి నాణ్యత చాలా పేలవమైన వర్గంలో ఉంటుంది. ఢిల్లీలో ఉదయం సాధారణం కంటే చలి నమోదవుతోంది. అయితే, రోజంతా సూర్యరశ్మి కారణంగా పగటి ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుంది. వాతావరణ శాఖ ప్రామాణిక అబ్జర్వేటరీ సఫ్దర్‌జంగ్‌లో శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రత 32.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది ఈసారి సాధారణ ఉష్ణోగ్రత. ఇదే సమయంలో సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగా 15.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చర్మ వ్యాధి సోరియాసిస్‌కు దుమ్ము, కాలుష్యం కారణంగా మారుతున్నాయి. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేయడం వల్ల గుండెపోటు మరియు స్ట్రోక్ వస్తుంది.
దేశ రాజధాని ఢిల్లీలో ‘సెంచరీ’ కొట్టిన ఉల్లి.. త్వరలోనే రూ.150కూడా
ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఉల్లి ధర సెంచరీ కొట్టింది. ఆ ప్రాంతంలో ఉల్లి రిటైల్ ధర రూ.100కి చేరింది. హోల్‌సేల్ మార్కెట్‌లో దాదాపు రూ.80కి చేరింది. ఉల్లి ధర ఇంకా వేగంగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. త్వరలో ఉల్లి రిటైల్ ధర రూ.150 దాటే అవకాశం ఉంది. మరోవైపు వినియోగదారుల వ్యవహారాల ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఢిల్లీలో ఉల్లి గరిష్ఠ ధర రూ.68కి చేరింది. మరోవైపు ఆల్ ఇండియా స్థాయిలో అత్యధిక ధర రూ.77. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో ఉల్లి ధర 100 రూపాయలకు ఎందుకు చేరుకుందో తెలుసుకుందాం. ఢిల్లీకి ఆనుకుని ఉన్న నోయిడాలో ఉల్లి ధర రూ.100కి చేరింది. నోయిడాలోని సెక్టార్ 88లో ఉన్న హోల్‌సేల్ మార్కెట్ నుండి ఉల్లిపాయలు కిలో ధర 80 రూపాయలు పలుకుతోంది. దీంతో ఉల్లి చిల్లర ధర రూ.100కి పెరిగింది. మరోవైపు, ఢిల్లీలోని మోడల్ టౌన్ ప్రాంతంలో ఉల్లి ధర కిలో రూ.70 నుంచి రూ.90కి పెరిగింది. విశేషమేమిటంటే, ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ ఆజాద్‌పూర్ మోడల్ టౌన్ ప్రాంతానికి చాలా సమీపంలో ఉంది. మార్కెట్‌లోనే చాలా ఖరీదైన ఉల్లి లభిస్తున్నదని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు. గత వారం రోజులుగా ఢిల్లీలో ఉల్లి ధర దాదాపు రూ.20 పెరిగింది.
అదిరిపోయే ఫీచర్లతో ఒప్పో A79 5G వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ ను అందిస్తుంది.. యూత్ కు అవసరమయ్యే ఫీచర్స్ తో పాటుగా సరసమైన ధరలకే మొబైల్స్ ను అందిస్తుంది.. తాజాగా అదిరిపోయే ఫీచర్స్ తో ఒప్పో A79 5G వచ్చేసింది.. ఎ-సిరీస్ లైనప్‌లో సరికొత్త ఆఫర్‌గా లాంచ్ అయింది. ఈ కొత్త 5G ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది.. ఫీచర్స్, కాస్ట్ ఏంటో ఓ లుక్ వేద్దాం పదండీ.. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సీటీ 6020 SoC ద్వారా ఆధారితంగా 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో ఉంటుంది. ఒప్పో A79 5జీ ఫోన్ 6.72-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లేను సెంటర్ హోల్ పంచ్ కటౌట్‌తో కలిగి ఉంది. 50ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.. ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే దాదాపు 27 గంటలు వస్తుందట.. 6.72-అంగుళాల ఫుల్-HD+ (1,080×2,400 పిక్సెల్‌లు) LCD స్క్రీన్‌తో గరిష్టంగా 90Hz రిఫ్రెష్ రేట్, 391ppi పిక్సెల్ డెన్సిటీ, 6150నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 9150 నిట్స్ స్క్రీన్ కలిగి ఉంటుంది. 7nm మీడియా టెక్ డైమెన్సిటీ 6020 SoC, 8GB LPDDR4X RAM, 128GB UFS2.2 స్టోరేజ్‌తో అందిస్తుంది.. అదే విధంగా ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు సపోర్టు ఇస్తుంది. ఒప్పో A79 5G ఫోన్ 5,000mAh బ్యాటరీతో 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది…
అంపైర్ అవుట్ ఇచ్చి ఉంటే.. మేం రేసులో ఉండేవాళ్లం: బాబర్
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శుక్రవారం ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై పాకిస్తాన్ ఒక వికెట్ తేడాతో ఓడిపోయింది. 271 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 9 వికెట్లు కోల్పోయి 47.2 ఓవర్లలో ఛేదించింది. ఐడెన్ మార్‌క్రమ్ (91; 93 బంతుల్లో 7×4, 3×6) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. సాద్ షకీల్ (52; 52 బంతుల్లో 7×4), బాబర్ అజామ్ (50; 65 బంతుల్లో 4×4, 1×6) హాఫ్ సెంచరీలు చేశారు. అయితే గెలిచే మ్యాచ్‌లో పాక్ ఓడిపోయింది. ‘అంపైర్స్ కాల్’ పాక్ జట్టును ముంచింది. దక్షిణాఫ్రికా ఆఖరి బ్యాటర్ తబ్రైజ్ షంసీ.. పాక్ పేసర్ హరీష్ రవూఫ్ బంతికి వికెట్ల ముందుకు దొరికిపోయాడు. కానీ అంపైర్ ఔటివ్వలేదు. రిప్లేలో బంతి స్టంప్‌కు కొంచెమే తాకేదని తేలడంతో నిర్ణయం ‘అంపైర్ కాల్’గా వచ్చింది. దాంతో సఫారీ జట్టు బతికిపోయింది. ఈ విషయంపైనే పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ స్పందించాడు. ఒకవేళ అంపైర్ అవుట్ ఇచ్చి ఉంటే.. తాము ప్రపంచకప్ 2023 రేసులో ఉండేవాళ్లం అని పేర్కొన్నాడు. అయితే ఇదంతా ఆటలో భాగమని చెప్పాడు. మ్యాచ్ అనంతరం బాబర్ మాట్లాడుతూ కాస్త నిరాశకు గురయ్యాడు.
టీమిండియాకు తలనొప్పిగా మారిన హార్దిక్ గాయం.. జట్టు కూర్పుపై తీవ్ర ప్రభావం!
స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో జట్టుకు దూరం కావడం వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారింది. హార్దిక్ జట్టులోకి వచ్చే వరకు కూర్పు పరంగా జట్టుకు ఇబ్బందులు తప్పేలా లేవు. న్యూజిలాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో హార్దిక్ స్థానాన్ని భర్తీ చేయడం కోసం మేనేజ్మెంట్ రెండు మార్పులు చేయాల్సి వచ్చింది. పేస్ బౌలింగ్‌ను బలోపేతం చేయడం కోసం శార్దూల్ ఠాకూర్‌పై వేటు వేసి.. మొహ్మద్ షమీని తీసుకోవాల్సి వచ్చింది. అలానే బ్యాటింగ్ బలోపేతం కోసం సూర్యకుమార్ యాదవ్‌ను ఆడించారు. షమీ 5 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టగా.. సూర్య కీలక సమయంలో రానౌట్ అయి నిరాశపరిచాడు. ఇక ఆదివారం లక్నోలో ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు భారత జట్టు కూర్పు ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. లక్నోలో పిచ్ స్పిన్నర్లకు అనుకూలమన్న అంచనాల నేపథ్యంలో మూడో స్పిన్నర్‌గా వెటరన్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంచుకోవడంపై భారత్ మేనేజ్మెంట్ దృష్టిసారించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే.. స్పెషలిస్టు పేసర్లను ఇద్దరికి పరిమితం చేయాల్సి ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా మొహ్మద్ సిరాజ్, మొహ్మద్ షమీలలో ఒకరే ఆడుతారు. సిరాజ్, షమీలలో ఎవరిని ఎంచుకోవడం అంటే తలనొప్పే.
డైట్ చెయ్యకుండా బరువు తగ్గాలంటే వీటిని తీసుకోవాల్సిందే..
అధిక బరువు అనేది ఈరోజుల్లో పెద్ద సమస్యగా మారింది.. బరువు తగ్గాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కడుపు మాడ్చుకొన్ని మరీ డైట్ చేస్తారు.. అలా అవసరం లేకుండానే కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. మరి ఆలస్యం ఎందుకు ఎలాంటి ఫుడ్ ను తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.. కాల్చిన మొక్కజొన్న చాలా రుచిగా ఉంటుంది. అందులో నిమ్మరసం, ఉప్పు కలిపితే దాని రుచి మరింత పెరుగుతుంది. ఇందులో ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.. కానీ రెండు లేదా అంతకంటే ఎక్కువ మొక్కజొన్నలను ఎప్పుడూ కలిపి తినకూడదు.. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.. సాయంత్రం టీ తాగాలని అనిపిస్తే, మిల్క్ టీకి బదులుగా హెర్బల్ టీ లేదా మసాలా టీ తాగడం ప్రారంభించండి. ఇది మీ కడుపు నుండి వేడిని తొలగిస్తుంది. మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో సాయపడుతుంది.. స్ప్రౌటెడ్ మూంగ్ చాట్ లేదా స్ప్రౌట్స్ చాట్ స్నాక్‌గా తినడానికి గొప్ప ఎంపిక. ఇది మీ శరీరానికి అత్యంత ఆరోగ్యకరమైన స్నాక్స్‌లో ఒకటి. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది..అలాగే తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది.. భేల్ పూరీని చిరుతిండిగా కూడా తినవచ్చు. ఇది టొమాటో, ఉల్లిపాయ, పఫ్డ్ రైస్, నిమ్మ, వేరుశెనగతో తయారు చేస్తారు. ఇది తింటే ఖచ్చితంగా రుచిగా ఉంటుంది.. ఇది అదనపు కొవ్వును తగ్గించడంతో పాటు బరువు కంట్రోల్లో ఉంచుతుంది..