బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అబ్దుల్ కలాం జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం జీవితం అందరికీ స్పూర్తి.. ప్రస్తుతం కులాలు మతాలను రాజకీయాల కోసం విభజిస్తున్న పరిస్థితి నెలకొంది అని ఆమె అన్నారు.
మధు ఖోడా, సిబు సోరేన్, జయలలిత, లాలు ప్రసాద్ యాదవ్ లాంటి మాజీ ముఖ్యమంత్రులు తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసింది అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు విషయంలో కూడా అంతే.. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుపై ఆధారాలు ఉన్నాయి కాబట్టే సీఐడీ అరెస్ట్ చేసింది.
విశాఖ నుంచి పరిపాలన కొనసాగించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దసరా పండగ నుంచి విశాఖ నుంచే పరిపాలన చేయాలని సీఎం జగన్ పట్టుదలగా ఉన్నారు. దీంతో విశాఖలో సీఎం క్యాంపు ఆఫీస్, వసతి సదుపాయం, మంత్రులు, సీనియర్ అధికారులకు ట్రాన్సిట్ వసతి లాంటి వాటి కోసం త్రీమెన్ కమిటీని సీఎస్ జవహార్ రెడ్డి నియమించారు.
తిరుమలలో శ్రీ శ్రీనివాసుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ఆరంభం కానున్నాయి. అక్టోబర్ 23వ తేదీ వరకు జరుగనున్నాయి. అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలకు నిన్న (శనివారం) సాయంత్రం శాస్త్రోక్తంగా టీటీడీ అర్చకులు అంకురార్పణ చేపట్టారు.