నాలుగున్నరేళ్లలో ఇసుక బొక్కేసి రూ. 40 వేల కోట్లు దోచిన గజదొంగ ఎవరు జగన్ రెడ్డి? కదా అని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఇసుకను మీరు దోచేసి ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై అక్రమ కేసు సిగ్గనిపించటం లేదా?.. అధికారికంగా 110 రీచుల్లో ఇసుక తవ్వకాలు అని చెబుతూ 500కు పైగా రీచుల్లో ఇసుక దోచేయటం వాస్తవం కాదా? అని ఆయన ఆరోపించారు. ఏపీలో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ఎన్జీటీ ఉత్వర్వులివ్వలేదా?.. వైసీపీ ఇసుక దోపిడికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి జగన్ రెడ్డి?.. ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై కేసు పెడితే మరి పేదల కడుపు కొట్టి రూ.40 వేల కోట్లు దోచుకున్న జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి, జే గ్యాంగ్ లపై ఏం కేసులు పెట్టాలి? అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Canada: కెనడాలో శాశ్వతం స్థిరపడాలనుకునే వారికి గుడ్ న్యూస్.. 4.85 లక్షల మందికి పీఆర్..
ఉచిత ఇసుక రద్దు చేసి, 40 లక్షల మంది కార్మికుల్ని రోడ్డున పడేసి 160 మంది భవన నిర్మాణ కార్మికుల్ని బలిగొన్న దుర్మార్గుడు జగన్ రెడ్డి అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఇప్పటికే 3 సార్లు ఇసుక పాలసీ మార్చారు.. ఇప్పుడు జగన్ తన తమ్ముడు అనిల్ రెడ్డికి ఇసుక కాంట్రాక్టు కట్టబెట్టేందుకు కొత్త నాటకానికి తెరలేపారు.. ఇసుక టెండర్లు అనిల్ రెడ్డికి కట్టబెట్టేందుకు టెండర్ నిబంధనల్నీ మార్చేసి డాక్యుమెంట్ ధరను రూ.29.5 లక్షలుగా నిర్ధారించారు అని అచ్చె్న్నాయుడు అన్నారు. ఉన్న ఆరు నెలల్లో రాష్ట్రంలో ఉన్న ఇసుకంతా దోచేయాలన్నదే జగన్ రెడ్డి ప్లాన్, అందుకే ఈ కుట్ర చేస్తున్నారని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు. ప్రకృతి ప్రసాదించిన సహజవనరుల్లో జే గ్యాంగ్ దేనిని వదలటం లేదు.. ఇసుకతో పాటు బైరైటీస్, బాక్సైట్, లేటరైట్, రాక్సీ గ్రానైట్, సిలికా అన్ని దోచేస్తున్నారు అని ఆయన ఆరోపించారు.