Narayana Swamy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి హాట్ కామెంట్స్ చేశారు.. ఎన్నికల స్టెంట్‌లో భాగంగానే కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.. రెండు రోడ్లు, ఒకరోడ్డు అని మాట్లాడటం ఏంటి? అని నిలదీసిన ఆయన.. తెలంగాణాలోని సెటిలర్స్ ఓట్లు కోసమే ఏపీ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్టుగా కేసీఆర్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.. అక్కడ కమ్మ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్న ఆయన.. అసలు కేసీఆర్ మనసులో ఎముందో చెప్పాలని నిలదీశారు. ఏపీలో నవరత్నాల పథకాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు.. ఆ విషయం కేసీఆర్‌కు తెలుసా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.
Read Also: Kanpur: ఐబ్రోస్ షేప్ నచ్చలేదని.. భార్యకు ఫోన్లోనే విడాకులు ఇచ్చిన భర్త
కాగా, తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. వరుస పర్యటనలు, సభలు, సమావేశాలతో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయితే, ఏపీ, తెలంగాణలో జరిగిన అభివృద్ధిని పోలుస్తూ.. కేసీఆర్ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి.. మన పొరుగు రాష్ట్రం ఏపీని చూస్తే తెలియట్లేదా? మన అభివృద్ధి అని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణలో వెలుగులు, ఏపీలో చీకట్లు.. తెలంగాణ డబుల్ రోడ్లు, ఏపీలో సింగిల్ రోడ్లు అంటూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.. సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్.. ఆయన మాట్లాడుతూ.. ఏపీ రైతులు తమ పంటలను తెలంగాణకు తీసుకొచ్చి అమ్ముతున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడితే కరెంట్ ఉండదు, కారు చీకట్లు అలుముకుంటాయని బెదిరించారు.. కానీ, ఇప్పుడు ఏపీలోనే చీకట్లు ఉండే పరిస్థితి వచ్చిందంటూ ఆయన ఎద్దేవా చేశారు.. దీంతో.. ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఎటాక్‌కు దిగారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.