Ambati Rambabu: దమ్ముంటే అసెంబ్లీకి రా అని చంద్రబాబు ఇప్పుడు సవాలు విసురుతున్నారు.. నువ్వు ఏడ్చి ఎందుకు పారిపోయావు.. ఇప్పుడొచ్చి సవాలు విసురుతున్నావా..? అంటూ మండిపడ్డారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. లిక్కర్ స్కాం కేసు అక్రమంగా పెట్టిన నిరాధారమైన కేసు.. బేతాళ కథలను తలపించేలా లిక్కర్ కేసు ఉంది.. మూడవ ఛార్జ్ షీట్ లో కూడా చెప్పిందే చెప్పినట్లుగా చెప్పారు.. దీని ఉద్దేశ్యం ఏంటో అందరికీ క్లియర్ గా అర్థం అవుతుందన్నారు.. ఈ కేసులో జగన్ కు దగ్గరగా ఉన్న వారిని అవకాశం ఉన్నంత వరకు ఎక్కువ రోజులు జైళ్లో పెట్టే ఉద్దేశ్యంతో పెట్టిన కేసుగా ఆరోపించిన ఆయన.. ఏ వ్యక్తి అయినా నేరారోపణతో అరెస్టయితే 90 ఛార్జ్ షీట్ వేయకపోతే వారిని బెయిల్ ఇవ్వొచ్చని చట్టం చెప్తుంది. అరెస్టు చేసిన వారిని బయటకు రానీయకూడదని పొంతన కుదరకుండా చేస్తున్నారు.. చెవిరెడ్డి కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేయాలని చూస్తున్నారు.. జగన్ వెంట ఉన్నందుకే కక్ష్యతో ఇబ్బంది పెట్టి వేధిస్తున్నారు. చట్టబద్ధంగా పనిచేస్తున్న కంపెనీలను కూడా డొల్ల కంపెనీలు అంటున్నారు. కంపెనీ తరఫున భూములు కొని అమ్మటం తప్పా..? అని నిదీశారు.
Read Also: North Korea: కిమ్ కోపానికి కరిగిపోయిన ఐస్ క్రీం.. దెబ్బకు పేరు మారిపోయింది…
కొన్ని పత్రికలు అనుకుని వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా వార్తలు రాస్తాయి.. ఆ తర్వాత సిట్ దాన్నే కోట్ చేస్తూ అరెస్టులు చేయటం పరిపాటిగా మారిందని మండిపడ్డారు అంబటి.. భాస్కర్ రెడ్డి మీద కేసు పెట్టారు.. బయటకు రాకుండా చేయాలని కథలు అల్లారు. సోషల్ మీడియా మెయింటెయిన్ చేశారు కాబట్టి సజ్జల భార్గవరెడ్డి మీద కేసు. కక్ష్య కట్టి కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు.. కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు చదివితే ఛార్జ్ షీట్ చదవాల్సిన పని లేదన్న ఆయన.. ఛార్జ్ షీట్ లో మొత్తం ఈ కథనాలు తప్ప ఏమీ ఉండవు. ఇవి అతకక పోవటం వల్ల కోర్టు వారు తిప్పి పంపిస్తున్నారు.. 11 కోట్ల వ్యవహారంలో సిట్ ఎన్నిసార్లు సిట్ అయ్యిందో.. స్టాండ్ అయ్యిందో అందరూ చూశారని ఎద్దేవా చేశారు..
అసలు, ప్రభుత్వం మద్యం అమ్మితే స్కాం ఎక్కడి నుంచి జరుగుతుంది..? అని ప్రశ్నించారు అంబటి.. నిజంగా స్కాం ఇప్పుడు జరుగుతుందన్న ఆయన. స్కాములు మొత్తం చేస్తుంది చంద్రబాబు, లోకేష్ తప్ప మరొకరు కాదని ఆరోపించారు.. ఏదో ఒక విధంగా వైసీపీని అణచివేయాలని చూస్తున్నారు. మీరు ఎంత అణచివేయాలని చూసినా వైసీపీ ని ఏం చేయలేరు. దీన్ని తొక్కేస్తాం.. నాశనం చేస్తాం అంటే సాధ్యం కాదు అని హెచ్చరించారు. దేశంలో ఇంత దారుణమైన కేసులు మరే రాష్ట్రంలో పెట్టి ఉండరు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.