Cabinet sub-committee: సోషల్ మీడియాలో పనికివచ్చే సమాచారం ఉన్నా.. కొందరిని టార్గెట్ చేస్తూ.. వ్యక్తిగతంగా దూషిస్తూ పోస్టులు పెట్టడం.. వాటిని వైరల్ చేయడంతో చాలా మంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి.. ఇక, మహిళలు అని కూడా చూడకుండా.. అసభ్యపదజాలంతో పెట్టే కొన్ని పోస్టులు.. వారితో పాటు వారి కుటుంబాలను కూడా తీవ్రంగా కలచివేస్తున్నాయి.. ఇక, కొన్ని వీడియోలు పెట్టి వైరల్ చేయడంతో.. అది నిజమా? అబద్దమా? అని తెలుసుకోవానికి తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి.. దీనిపై సీరియస్‌గా దృష్టిపెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సోషల్ మీడియాలో మహిళలను కించపరిచే పోస్ట్ ల పై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది.. మంత్రులు వంగలపూడి అనిత, నాదెళ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్థసారథిలతో ఉప సంఘం ఏర్పాటు చేసింది కూటమి సర్కార్.. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, మహిళలను కించపరిచే ప్రచారలపై అధ్యయనం చేయనుంది మంత్రి వర్గ ఉప సంఘం.. ఇక, శీతాకాల అసెంబ్లీ సమావేశాలల్లో బిల్లు ప్రవేశపెట్టనుంది కూటమి సర్కార్..
Read Also: Zepto: చిక్కడపల్లిలో జెప్టో డెలివరీ బాయ్స్ వీరంగం.. కస్టమర్‌పై మూకుమ్మడి దాడి