Balakrishna : హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. హిందూపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ వెళ్లారు. హిందూపురం మండలం కిరీకేర పంచాయతీ బసవనపల్లి ZPHS లో 64 లక్షల రూపాయలతో నిర్మించిన స్కూల్ బిల్డింగ్ ను బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన తిరిగి వస్తున్న సందర్భంలో కిరీకేర పంచాయతీ బసవనపల్లి వద్ద ప్లకార్డ్స్ పట్టుకొని అభిమానులు రోడ్డుపై నినాదాలు…
Jogi Ramesh : విశాఖలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం వ్యాపారంలో జరుగుతున్న కుంభకోణాలు, డైవర్షన్ రాజకీయాలు, మరియు ఆయనపై ఎదురవుతున్న మద్యం కేసులపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ, “నన్ను మద్యం కేసులో ఇరికించాలని చూస్తున్నారు. కానీ నిజానికి మద్యం కుంభకోణాన్ని బట్టబయలు చేసింది మా పార్టీనే. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా చీఫ్ పాలిటిక్స్ ను వేరే దిశలో మలిచే ప్రయత్నం…
Deputy CM Pawan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యా్ణ్ తో తన ప్రయాణం మొదలైన రోజును మంత్రి నాదెండ్ల మనోహర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా 2018 అక్టోబర్ 12వ తేదీన ప్రారంభమైన ప్రయాణం జనసేనతో నా రాజకీయ ఆరంభం అంటూ అప్పటి ఫోటోను షేర్ చేశారు.
Off The Record: వైసీపీలో వార్నింగ్ బెల్ మోగిందా? డైరెక్ట్గా ముఖ్య నాయకుల్ని ముందు పెట్టుకుని మరీ.. అధ్యక్షుడు జగన్ రెడ్ బజర్ నొక్కారా? పార్టీ కార్యక్రమాల విషయంలో సీరియస్గాలేని మమ బ్యాచ్ ఇక ఇంటికేనంటూ డైరెక్ట్గానే చెప్పేశారా? నేను గేర్ మార్చేశా.. మీరు స్పీడ్ అందుకోకుంటే.. కష్టమని ఏ సందర్భంలో చెప్పారు జగన్? ప్రస్తుతం ఆయన ప్లానింగ్ ఎలా ఉంది? వైసీపీ… తాడేపల్లి సెంట్రల్ ఆఫీస్లో ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో పలు ఆసక్తికర పరిణామాలు…
YV Subba Reddy: రైతుల పక్షాన పోరాడి యూరియా కష్టాలు తీర్చటానికి కృషి చేశామని వైవి.సుబ్బారెడ్డి అన్నారు. కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. NTR జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అధ్యక్షతన జరిగిన జిల్లా వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో వైవి.సుబ్బారెడ్డి మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మా దృష్టిలో ఉన్నాం.. ఎవరు కేసులకు భయపడాల్సిన పని లేదు.. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. డయేరియా బాధితులను అలాగే…
YS Jagan: జగన్ మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకు షరతులతో కూడిన అనుమతి లభించింది. రూట్ మార్చి..18 కండీషన్లతో పోలీసులు అనుమతి ఇచ్చారు. పోలీసులు ప్రతిపాదించిన మార్గంలోనే జగన్ పర్యటన నిర్వహించేందుకు వైసీపీ నాయకత్వం అంగీకరించింది. ఈ అంశంపై మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడారు. "జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. స్టీల్ ప్లాంట్ కార్మికులను జగన్మోహన్ రెడ్డి కలవకుండా చూసేందుకు పోలీసులు రూట్ మార్చారు.