Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలపై రాజకీయ కక్షసాధింపుతో వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే తమ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. “రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితి అంత దారుణంగా మారింది.. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా లేని స్థితి. హత్యలు, దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయి. ఈ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, మా చేతుల్లో లాఠీలు ఉన్నాయా…
YS Jagan : ఆంధ్రప్రదేశ్లో మెడికల్ విద్య రంగంపై సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం దరిద్రపు పని అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ మాట్లాడుతూ.. “మూడేళ్లలో మేము 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. ప్రతి జిల్లాలో గవర్నమెంట్ కాలేజీలు ఏర్పరిచాం. కానీ చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు. ఇప్పుడు వాటిని ప్రైవేట్ వారికి అప్పగించాలనే ప్రయత్నం…
వైఎస్సార్సీపీ సీనియర్ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేయించలేకపోయాడని విమర్శించారు.
Ramachandrapuram Bandh: నేడు రామచంద్రాపురం బంద్కు పిలుపు ఇచ్చింది జేఏసీ.. రామచంద్రాపురం నియోజకవర్గాన్ని ప్రస్తుతం ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వద్దు.. మా ప్రాంతాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నేడు రామచంద్రాపురం బంద్కు పిలుపునిచ్చింది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు రాజకీయ నాయకులు ప్రజల డిమాండ్ను పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని జేఏసీ నాయకులు మండిపడుతున్నారు.. రామచంద్రాపురం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం నుండి…
ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ని విమర్శించే స్థాయి ఆదినారాయణ రెడ్డికి లేదన్నారు. అధికారం లేకపోతే పిల్లిలా ఉండే ఆదినారాయణ రెడ్డి.. ఇప్పుడు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అవసరాన్ని బట్టి పార్టీలు మార్చే వ్యక్తి అని విమర్శించారు. చికెన్ షాపుల్లో కూడా కమీషన్లు కొట్టేసే స్థాయి ఆదినారాయణ రెడ్డిది అని ఎద్దేవా చేశారు. జగన్ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటానికి…
Jogi Ramesh: విజయవాడలోని గురునానక్ కాలనీలోని ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్లో నాలుగు గంటలుగా వైసీపీ మాజీమంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము ఉన్నారు. జోగి రమేష్ ను అదుపులోకి తీసుకున్న అనంతరం ఆయన ఇంటిలో సిట్ అధికారుల తనిఖీలు చేపట్టారు.
Jogi Ramesh PA: ఇవాళ ఉదయం జోగి రమేష్తో పాటు పీఏ ఆరేపల్లి రామును అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఉదయం 12 గంటల సమయంలో జోగి పీఏ ఆరేపల్లి రామును బయటకు వదిలి పెట్టారు.
YS Jagan: వైసీపీ నేత, మాజీమంత్రి జోగి రమేష్ అరెస్ట్ పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే జోగి రమేష్ ను అరెస్ట్ చేశారంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
Former CJI NV Ramana: గత ప్రభుత్వ హయాంలో తన కుటుంబాన్ని టార్గెట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీఐటీ యూనివర్సిటీ ఐదో స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. తన కుటుంబాన్ని టార్గెట్ చేసినా భరించానన్నారు. వ్యవస్థలు కష్టకాలంలోనే పరీక్షకు గురవుతాయన్నారు. గత పాలకుల నిర్ణయాలతో అమరావతి కష్టాలకు గురయ్యిందన్నారు. రైతుల కష్టం, త్యాగంతో అమరావతి నిర్మాణం జరుగుతుందన్నారు. న్యాయవ్యవస్థపై రైతులు నమ్మకం…
మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ పూర్తిగా అక్రమం.. ఇది కేవలం కక్ష సాధింపు చర్యగా వైసీపీ నేతలు పేర్కొన్నారు. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ను దురుద్దేశంతోనే ఇరికించారు.. ఈ కేసులో కస్టడీలో ఉన్న ఏ-1 నిందితుడు జనార్థన్ రావు ద్వారా జోగి రమేష్ పేరు చెప్పించారు.