Deputy CM Pawan Kalyan: సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు.. చివరకు ఎమ్మెల్యేలు వస్తున్నా సరే.. అధికారులు హడావుడి చేస్తారు.. వారిని ప్రసన్నం చేసుకోవడానికి సొంత డబ్బులతో అధికారులు బొకేలు, శాలువాలు.. ఇంకా రకరాల గిఫ్ట్లు ఇస్తుంటారు.. అయితే, వీటికి మొదటి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దూరం.. ఇక, రోజు చిత్తూరు పర్యటనలో ఇవి ఏవీ లేకపోవడంపై సంతోషంగా వ్యక్తం చేశారు.. అంతేకాదు, చిత్తూరు జిల్లా అధికారులను అభినందించారు.. Read Also: Jupally Krishna…
Minister Atchannaidu: అబద్ధాలకు అంబాసిడర్గా వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారు అని ఆరోపణలు గుప్పించారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. వైఎస్ జగన్ చేస్తున్న నీచ ఆరోపణల గురించి రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అవగాహన ఉందని మంత్రి స్పష్టం చేశారు. కేవలం 18 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన అబద్ధాలను బట్టబయలు చేసిందని అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వని జగన్ మాట్లాడే అర్హతే లేదని మంత్రి తేల్చిచెప్పారు.…
Off The Record: వల్లభనేని వంశీ…. ఏపీ పాలిటిక్స్లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. గన్నవరం నుంచి రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారాయన. అదే పార్టీ తరపున ఒకసారి విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2024లో వైసీపీ బీ ఫామ్ మీద బరిలో దిగి ఓటమి పాలయ్యారు. అయితే… 2019లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత వైసీపీకి జై కొట్టారు వంశీ. ఆ క్రమంలోనే… 2019 నుంచి 2024 మధ్య…
Pawan Kalyan: జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు తమ పంచాయతీల నుంచి పార్లమెంట్ నియోజకవర్గం వరకు అభివృద్ధిలో భాగం కావాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. తాజాగా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో పవన్ సమావేశం నిర్వహించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ప్రాంత అభివృద్ధిలో అక్కడ అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించేలా పార్టీ శ్రేణులను ముందుకు తీసుకువెళ్దామన్నారు. జనసేన పార్టీ కమిటీల నిర్మాణంలో భాగంగామన్నారు. గ్రామ…
Suspended IPS officer PV Sunil Kumar: సస్పెన్షన్ లో వున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పొలిటికల్ కామెంట్స్ మరోసారి వేడిని రాజేశాయి. కాపు, దళితులతో రాజ్యాధికారం ఫార్ములాను ప్రతిపాదించి మరోసారి సంచలనం సృష్టించారు. కాపులకు ముఖ్యమంత్రి పదవి.. దళితులకు డిప్యూటీ సీఎం కోసం ప్రణాళిక బద్ధంగా ఆలోచన చేయాలని సూచించారు సునీల్ కుమార్. ఆ దిశగా కాపులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆదివారం అనకాపల్లి జిల్లా గాంధీ గ్రామంలో జరిగిన…
Andhra Pradesh: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు తమ పదవికి రాజీనామా చేసారు. వెంటనే తమ రాజీనామాలను ఆమోదించాలని.. మండలి చైర్మన్ ను కోరారు.. మండలి కార్యాలయం పిలుపు మేరకు ఎమ్మెల్సీలు జయమంగళ వెంకటరమణ , మర్రి రాజశేఖర్, కర్రీ పద్మశ్రీ, బల్లి దుర్గాప్రసాద్, జకీయా ఖానుమ్, పోతుల సునీత.. ఈ రోజు మండలి చైర్మన్ ను కలిసారు. అయితే, ఇప్పటికే ఎమ్మెల్సీ జయమంగళ కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు జయమంగళ రాజీనామా పై నాలుగు…
Marri Rajasekhar: వైసీపీలో తనకు అన్యాయం జరిగింది అంటున్నారు ఎమ్మెల్సీ మర్రి రాజ్ శేఖర్.. మండలి చైర్మన్ తన రాజీనామా ఆమోదించే అవకాశం ఉందని తెలిపారు.. ఇక, తాను స్వచ్ఛందంగా రాజీనామా చేసిన విషయాన్ని మండలి చైర్మన్ కు చెప్పా అన్నారు.. 2025 మార్చి 19న నేను ఎమ్మెల్సీగా రాజీనామా చేశాన.. నా రాజీనామా మండలి చైర్మన్ కు ఇచ్చాను .. స్వచ్ఛందంగా రాజీనామా ఇచ్చాను అని స్పష్టం చేశారు.. ఇవాళ నన్ను హాజరు కావాలని మండలి…
Devineni Avinash: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గంలో 95 వేలకు పైగా సంతకాలు పూర్తయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికి NTR జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ పిలుపునిచ్చిన ఏ కార్యక్రమం అయినా తూర్పు నియోజకవర్గంలో విజయవంతం అవుతుందని కొనియాడారు. ఈ విషయాన్ని స్వయంగా జగన్ మెచ్చుకున్నారని తెలిపారు.…
Off The Record: అంతకు ముందు సంగతి ఎలా ఉన్నా…100 శాతం స్ట్రైక్ రేట్తో అధికారంలోకి వచ్చాక కూడా జనసేన నడవడికలో తడబాటు కనిపిస్తోందన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఎన్నికల వరకు అన్ని రకాలుగా పార్టీని ముందుండి నడిపించిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బిజీ అయ్యారు. అలాగే నాదెండ్ల మనోహర్ కూడా మంత్రి హోదాలో బిజీ అవడంతో… పార్టీ వ్యవహారాలు గాడి తప్పుతున్నాయన్న అభిప్రాయం సొంత వర్గాల్లోనే బలపడుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ…