Minister Nimmala: నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటనకు కులం రంగు పులిమి వైసీపీ విష ప్రచారం చేయడం ఆ పార్టీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. శవ రాజకీయాలు సృష్టించి ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తుందని అన్నారు.
అద్దెపల్లి జనార్థన్, జయ చంద్రారెడ్డి స్నేహితులని మీరే చెప్పారు అని గుర్తు చేశారు. ఇక, జనార్థన్ కు రెడ్ కార్పెట్ వేసి మీరే రప్పించారు అన్నారు. ఆయనతో నా పేరు చెప్పించారు.. కస్టడీలో ఉన్న వ్యక్తి వీడియో ఎలా బయటకు వచ్చింది అని మాజీ మంత్రి ప్రశ్నించారు. అయితే, నకిలీ మద్యం కేసులో ఏ విచారణకు అయినా నేను సిద్ధంగా ఉన్నాను, లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధం, ఎక్కడికైనా వస్తాను అని జోగి రమేశ్ సవాల్…
Perni Nani: ఏపీలో మద్యం అమ్మకాల్లో క్యూఆర్ కోడ్ తామే ప్రవేశపెట్టమన్నట్లుగా సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇది తామే కనిపెట్టినట్లుగా చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని.. అన్నీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తుంటే సారా మంత్రి ఏమి చేస్తున్నారని విమర్శించారు.. జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం బాటిల్ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చే ముందే క్యూఆర్ కోడ్ తోనే వచ్చేదని.. ఇప్పుడు అదేదో ఘన కార్యంలా చెప్పుకుంటున్నారన్నారు.. మీరు రాగానే…
YCP Ex-MLA Arrest: పల్నాడు జిల్లా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం నరసరావుపేటలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అనుచరులతో కలిసి గోపిరెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. గోపిరెడ్డితో పాటూ మరో 22 మంది అనుచరులపై నరసరావుపేట వన్ టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు.
YCP Protests: నకిలీ మద్యంపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నకిలీ మద్యం, కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాలలో వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.