YCP Ex-MLA Arrest: పల్నాడు జిల్లా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం నరసరావుపేటలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అనుచరులతో కలిసి గోపిరెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. గోపిరెడ్డితో పాటూ మరో 22 మంది అనుచరులపై నరసరావుపేట వన్ టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు.
YCP Protests: నకిలీ మద్యంపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నకిలీ మద్యం, కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాలలో వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Balakrishna : హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. హిందూపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ వెళ్లారు. హిందూపురం మండలం కిరీకేర పంచాయతీ బసవనపల్లి ZPHS లో 64 లక్షల రూపాయలతో నిర్మించిన స్కూల్ బిల్డింగ్ ను బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన తిరిగి వస్తున్న సందర్భంలో కిరీకేర పంచాయతీ బసవనపల్లి వద్ద ప్లకార్డ్స్ పట్టుకొని అభిమానులు రోడ్డుపై నినాదాలు…
Jogi Ramesh : విశాఖలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం వ్యాపారంలో జరుగుతున్న కుంభకోణాలు, డైవర్షన్ రాజకీయాలు, మరియు ఆయనపై ఎదురవుతున్న మద్యం కేసులపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ, “నన్ను మద్యం కేసులో ఇరికించాలని చూస్తున్నారు. కానీ నిజానికి మద్యం కుంభకోణాన్ని బట్టబయలు చేసింది మా పార్టీనే. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా చీఫ్ పాలిటిక్స్ ను వేరే దిశలో మలిచే ప్రయత్నం…
Deputy CM Pawan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యా్ణ్ తో తన ప్రయాణం మొదలైన రోజును మంత్రి నాదెండ్ల మనోహర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా 2018 అక్టోబర్ 12వ తేదీన ప్రారంభమైన ప్రయాణం జనసేనతో నా రాజకీయ ఆరంభం అంటూ అప్పటి ఫోటోను షేర్ చేశారు.