Andhra Pradesh: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు తమ పదవికి రాజీనామా చేసారు. వెంటనే తమ రాజీనామాలను ఆమోదించాలని.. మండలి చైర్మన్ ను కోరారు.. మండలి కార్యాలయం పిలుపు మేరకు ఎమ్మెల్సీలు జయమంగళ వెంకటరమణ , మర్రి రాజశేఖర్, కర్రీ పద్మశ్రీ, బల్లి దుర్గాప్రసాద్, జకీయా ఖానుమ్, పోతుల సునీత.. ఈ రోజు మండలి చైర్మన్ ను కలిసారు. అయితే, ఇప్పటికే ఎమ్మెల్సీ జయమంగళ కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు జయమంగళ రాజీనామా పై నాలుగు వారాల్లో గా చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో మండలి చైర్మన్ ను జయమంగళ కలిసారు. తన రాజీనామకు ఆమోదం తెలపాలని కోరారు. ఎవరైనా ప్రలోభ పెడితే రాజీనామా చేసారా. జనసేన లో చేరితే మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పారా అని మండలి చైర్మన్ జయమంగళను ప్రశ్నించారు.. వైసీపీకి తను రాజీనామా చేసి… జనసేనలో చేరా అని వైసీపీలో ఉంటే తనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు జయమంగళ… తన వ్యాపారాలు.. రాజకీయ అవసరాల కోసం జనసేన లోకి వెళ్ళా అన్నారు..
Read Also: Robbery Gang Arrest : దొరికింది.. దొంగల ముఠా..!
మర్రి రాజశేఖర్ కూడా వైసీపీపై ఘాటుగా స్పందించారు. తనకు వైసీపీలో విలువ, గౌరవం లేక రాజీనామా చేసాం అన్నారు. వైసీపీ కన్నా టీడీపీ లో ప్రజాస్వామ్యం ఎక్కువ అన్నారు. తాను కమ్మ సామాజిక వర్గం అని టీడీపీ చేరుతున్నా అనడం సరికాదన్నారు. తన రాజీనామా ను మండలి చైర్మన్ ఆమోదిస్తారు అనే నమ్మకం ఉందన్నారు.. అయితే, ఆరుగురు ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ మోషేన్ రాజు పిలిచి మాట్లాడారు. శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజ్‌కు వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది.. వైసీపీలో ఉండలేక రాజీనామా చేశామని చాలాసార్లు చెప్పామన్నారు ఆరుగురు ఎమ్మెల్సీలు. ప్రలోభాలకు లోనై రాజీనామాలు చేశారా అని ఎమ్మెల్సీలను ప్రశ్నించారు మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు… స్వచ్ఛందంగా రాజీనామాలు చేశామన్నారు ఎమ్మెల్సీలు.
అయితే, పదవీకాలం తక్కువే ఉన్నందున కొనసాగాలని రాజీనామా చేసిన ఆరుగురు ఎమ్మె్ల్సీలకు సూచించారు మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు. రాజీనామా ఉపసంహరణ పునరాలోచన ఏమైనా ఉందా? అని అడిగారు మండలి ఛైర్మన్. కానీ, వైసీపీలో కొనసాగే ఉద్దేశం లేకే రాజీనామాలు చేశామన్నారు ఎమ్మెల్సీలు… వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాల విషయంలో మండలి చైర్మన్ మోషేన్ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది..