OTR: ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి ఎమ్మెల్యేలు, సీనియర్ల నేతల మౌనంపై రకరకాల చర్చ జరుగుతోంది. వైసీపీ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నా…అత్యంత బలంగా వున్న కూటమి పార్టీల నుంచి కౌంటర్ అటాక్ కరువైంది. ఎందుకు మౌనంగా వున్నారన్నదానిపై వాడివేడి డిస్కషన్ సాగుతోంది. జిల్లా మొత్తంలో రెండు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్ధానం మాత్రమే కలిగి వున్న వైసీపీ…కూటమి ప్రభుత్వాన్ని అల్లాడించేస్తోంది. ఇష్యూ బేస్డ్ గా ఆ పార్టీ నాయకత్వం చేస్తున్న ఆందోళనలు, నిరసనలు హోరెత్తుతున్నాయి. కూటమి వాగ్ధానాల్లో మెజార్టీ అమలు సాధ్యంకాని మోసపూరిత హామీలేనని ప్రజల ముందు పంచాయితీ పెడుతోంది. కేడర్ బలంతో కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదికే నెగెటివిటీని డెవలప్ చేయడంలో వైసీపీ సక్సెస్ అవుతున్నట్టే కనిపిస్తోంది. ఇటీవల ఆ పార్టీ చేసిన నిరసనలు సక్సెస్ కావడం, మెడికల్ కాలేజీల పీపీపీ విధానంకు వ్యతిరేకంగా జగన్ చేసిన టూర్ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సంకట స్ధితిగా మారింది.
READ ALSO: Off The Record: కోల్డ్‌వార్ సోషల్ మీడియా సృష్టే.. విభేధాల్లేవని బండి, ఈటల ప్రకటన!
ఈ స్ధాయిలో ఎదురుదాడి ప్రతిపక్షం నుంచి వస్తున్నప్పుడు సీనియర్ ఎమ్మెల్యేలు అందిపుచ్చుకుని కడిగిపారేయాలి. ప్రభుత్వం దగ్గర వున్న డేటాతో సహా వాస్తవాలను ప్రజల ముందు ఆవిష్కరించి వైసీపీని ఎండగట్టే ప్రయత్నం జరగాలి. కానీ, అనూహ్యంగా సీనియర్ ఎమ్మెల్యేలు సైలెన్స్…మోడ్ ఎంచుకున్నారా అనేది చర్చ మారింది. బొత్స, గుడివాడ అమర్ వంటి నేతల దూకుడుకు బ్రేకులు వేసే సమర్ధత, రాజకీయ అనుభవం టీడీపీ సీనియర్లకు వుంది. కానీ, స్పందనలు రావాల్సింది అమరావతి నుంచే తప్ప మాతరపు నుంచి కాదన్నట్టే వుంటుంది ఇక్కడ నేతల తీరు. వాళ్ళంతా యాక్టి వ్ రోల్ తీసుకోకపోవడం వెనుక కారణాలు ఆసక్తికరం గానే వున్నాయి.
వాస్తవానికి, ప్రభుత్వం.., పార్టీ పరంగా లభిస్తున్న ఆదరణ పట్ల సీనియర్ ఎమ్మెల్యేలు అసంత్రుప్తిగా వున్నారు. ఏలూరు వేదికగా జరిగిన మహానాడులో మాడుగుల ఎమ్మెల్యే, మాజీమంత్రి బండారు సత్యన్నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలే అందుకు ఉదాహారణ. ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానంటూ ఆయన చేసిన కామెంట్స్ విస్త్రత చర్చకు తెరతీశాయి. నిధుల కేటాయింపులో మాడుగుల నియోజకవర్గం వివక్ష ఎదుర్కోంటోందనేది ఎమ్మె ల్యే ఆవేదన. అప్పట్లో ఈ వ్యవహారం మీద పెద్ద డిష్కషనే జరిగింది. ‘మా ప్రభుత్వం-మంచి ప్రభుత్వం’ అనే ఇంటింటీ కార్యక్రమాన్నీ పెద్దగా పట్టించుకోలేదు. ఇవ్వన్నీ కేవలం కొన్ని ఉదాహరణలే. జనసేన గెలిచిన దగ్గర టీడీపీ, టీడీపీ గెలిచిన చోట జనసేన ఎమ్మెల్యేలు, సీనియర్ల మధ్య గ్యాప్ పెరుగుతోంది. అధిష్టానం దగ్గరకు తీసుకెళ్లినా…చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటం గొడవను మరింత పెంచుతోంది.
విశాఖ వేదికగా జరిగిన సీఐఐ సమ్మిట్‌లో 13లక్షల కోట్ల విలువైన ఎంవోయూలను వచ్చాయన్న ప్రభుత్వ ప్రకటన పచ్చి బూటకమని వైసీపీ విమర్శిస్తోంది. ఈ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు ఆచితూచి మీడియా ముందుకు వచ్చింది మాజీ మంత్రి గంటా, ప్రభుత్వ విప్ గణబాబు మాత్రమే. రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లారి యాక్షన్ పక్కనబెడితే మిగిలిన ఎమ్మెల్యేలంతా ఏమై పోయారంటే …ష్ గప్ చుప్…!. గంటా సైతం వైసీపీకి చాలెంజ్ విసిరి నిరూపిస్తే రాజీనామా చేస్తానని గాంభీర్యం ప్రదర్శించినా పెద్దగా జనానికి రీచ్ అవ్వలేదు. ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ మీద సీఎం చేసిన వ్యాఖ్యలు అటు కార్మికులు, ఇటు రాజకీయ పక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకతకు కారణం అయ్యాయి. దీంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా సీఎం వ్యాఖ్యలను ప్రతి పక్షం వక్రీకరించిందని…..మా కమిట్మెంట్లో ఎటువంటి లోటు లేదని ట్వీట్ చేసి చేతులు దులిపేసుకున్నారు. ప్రజావేదికల మీద వైసీపీతో సై అంటే సై అని చాలెంజ్ చేసి నిరూపించాల్సిన చోట అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిమ్మకు నీరెత్తినట్టు కనిపించడం కచ్చితంగా లోటేనంటున్నాయి టీడీపీ వర్గాలు. పిలవని పేరంటం….కోరి కయ్యం రెండూ నష్టమేనని సీనియర్లు గుర్తించడం వల్లే ఈ తరహా వ్యవహారం నడుస్తోందన్న చర్చ జరుగుతోంది.
READ ALSO: WPL 2026 Auction List: ప్లేయర్‌ల వేలం లిస్ట్ విడుదల.. 73 స్థానాల కోసం 277 మంది పోటీ!