Suspended IPS officer PV Sunil Kumar: సస్పెన్షన్ లో వున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పొలిటికల్ కామెంట్స్ మరోసారి వేడిని రాజేశాయి. కాపు, దళితులతో రాజ్యాధికారం ఫార్ములాను ప్రతిపాదించి మరోసారి సంచలనం సృష్టించారు. కాపులకు ముఖ్యమంత్రి పదవి.. దళితులకు డిప్యూటీ సీఎం కోసం ప్రణాళిక బద్ధంగా ఆలోచన చేయాలని సూచించారు సునీల్ కుమార్. ఆ దిశగా కాపులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆదివారం అనకాపల్లి జిల్లా గాంధీ గ్రామంలో జరిగిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు సునీల్ కుమార్.. దళితవాడ పంచాయతీ డిమాండ్‌కు కాపు సోదరులు మద్దతిస్తే, తాము వారికి మద్దతిస్తామని పేర్కొన్నారు..
Read Also: TPCC Meeting: నేడు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం.. స్థానిక ఎన్నికలపై సీఎం రేవంత్ దిశానిర్దేశం..!
అయితే, అఖిల భారత సర్వీస్ నిబంధనలను సునీల్ కుమార్ ఉల్లంఘించారని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కేంద్రానికి ఫిర్యాదు చేశారు.. ప్రభుత్వ సర్వీసులో ఉన్న అధికారి ఇలా రాజకీయ, కులపరమైన వ్యాఖ్యలు చేయడం అఖిల భారత సర్వీసుల నియమావళిని ఉల్లంఘిచడమే అంటున్నారు అధికారులు.. ఇక, ఈ వ్యవహారంపై కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) కార్యదర్శికి సోమవారం లేఖ రాశారు రాఘురామ కృష్ణం రాజు.. కులాలను రెచ్చగొట్టేలా ఉన్న ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ, సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. కాగా, ఈ వ్యవహారంతో సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నట్టు అయ్యింది..