అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం శివకోడులో జరిగిన పల్లె పండుగ 2.0 బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి ఘాటైన ప్రసంగం చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై, కూటమి ప్రభుత్వ భవిష్యత్తుపై, సోషల్ మీడియాలో జరుగుతున్న విమర్శలపై ఆయన స్పష్టమైన సందేశాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “మా పార్టీలో ఎవరు తప్పు చేసినా నేను క్షమించను” అని హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణపై రాజీ ఉండబోమని, తప్పులు చేసిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
T20 World Cup 2026: భారత్ ఫైనల్స్‌కు వెళ్తుంది.. రోహిత్ శర్మ జోస్యం!
కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మాలని కోరుతూ.. “కొబ్బరి చెట్టును పెద్దకొడుకుగా ఎలా భావిస్తారో.. అలాగే కూటమి ప్రభుత్వాన్ని భావించండి” అని ఆయన అన్నారు. ప్రజలు అభివృద్ధి కోసం ఓర్పుతో సమయం ఇవ్వాలని, కూటమి ప్రభుత్వానికి కనీసం 15 ఏళ్ల స్థిరత్వం అవసరమని తెలిపారు. “ఈరోజుకీ వైసీపీ నాయకుల బూతులు, బుద్ధులు మారలేదు” అన్నారు. ప్రజాస్వామ్య విమర్శలను స్వాగతిస్తున్నామని, ప్రజలకు ఉపయోగపడే సూచనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. “మారకపోతే పవన్ కళ్యాణ్‌లో గట్టిదనం కూడా చూస్తారు” అంటూ ఘాటుగా స్పందించారు.
అలాగే 2029లో వైసీపీ అధికారంలోకి వస్తామని చేస్తున్న వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆయన, “రాజోలు గడ్డ నుంచి చెబుతున్నాను… అది జరగదు” అని స్పష్టం చేశారు. “యువత సమస్యల కోసం నన్ను నిలదీయండి” అంటూ పిలుపునిచ్చారు. సమాజ మార్పులో యువత పాత్ర కీలకమని, వారు చెప్పే సమస్యలకు ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పారు.
IND vs SA 2nd Test: భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే.. మెయిన్ రీజన్ గంభీర్!