గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు నియమితులపైన విషయం తెలిసిందే. నేడు ఆయనను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు. గోవా గవర్నర్ గా నియామకంపై అశోక్ కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు మాట్లాడారు.
తాడిపత్రిలో వైసీపీ మీటింగ్లో వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు.. అనంతపురంలో డంపింగ్ యార్డును తీసేసేందుకు రూ. 24 కోట్లు ఖర్చుపెట్టారని.. తాడిపత్రిలో డంపింగ్ యార్డ్ కు పది కోట్లు ఇచ్చారన్నారు.. కానీ ఒక్క రూపాయి కూడా వాడలేదని తెలిపారు. వైసీపీ నాయకులు మీటింగ్ తర్వాత చెత్తను ఎక్కడంటే అక్కడ పడేసి వెళ్లారన్నారు. రోడ్డుపైన వెళుతుంటే చెత్త దుర్వాసన వస్తుందని యాక్సిస్ బ్యాంకు వాళ్లు కంప్లైంట్ చేశారని చెప్పారు. మున్సిపాలిటీ…
వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీర్ కాదు అని మండిపడ్డారు. తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులను అడ్డుకుంటామంటే ఊరుకోము.. తాడిపత్రిలో ఎవరు ఉండాలో.. ఎవరు ఉండకూడదో ప్రభుత్వానికి జీవో జారీ చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి గడపకు తీసుకెళ్లి బలోపేతం చేస్తామన్నారు.
Tadipatri Tension: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇవాళ వైసీపీ ఆధ్వర్యంలో రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరుకావాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పిలుపునిచ్చారు.
సార్వత్రిక ఎన్నికలైన తరువాత నుంచి వైసీపీ జగన్కు షాక్ లా మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొన్న మాజీ మంత్రి ఆళ్ల నాని, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్లు వైసీపీకి బై బై చెబుతూ షాక్ ఇచ్చారు. వైఎస్సార్సీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్కు పంపుతూ రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్…