Roja vs TDP: మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నగరి నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ శ్రీశైలం బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వడమాలపేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, విజయపురం ఎంపీపీ లక్ష్మీపతిరాజు, నిండ్ర ఎంపీపీ భాస్కర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. శ్రీశైలం బోర్డు మాజీ చైర్మన్ చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ..…
Gudivada Amarnath: అన్నివైపులా విశాఖ అభివృద్ధిపై చర్చ సాగుతున్న వేళ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ అప్పుడు విశాఖ గురించి చెప్పిన విషయాలనే ఇప్పుడు చంద్రబాబు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. విశాఖ మన రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అని తొలి సారిగా వైఎస్ జగన్ ప్రకటించారని గుర్తుచేశారు. 2014లో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు విశాఖ ప్రాధాన్యతను ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. పరిశ్రమలు రావడం ఒక కొనసాగే…
Botsa Satyanarayana: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైద్య విద్యను ప్రయివేటు చేతుల్లో పెట్టే ప్రభుత్వ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పించారు.. వైద్యాన్ని ప్రయివేటు పరం చేయొద్దు అని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ఉద్యమం చేపట్టినట్టు బొత్స తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు…
KA Paul: మీరు వీవీవీఐపీ కావొచ్చు.. నేను అంతకంటే వీవీవీఐపీని అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. ఏపీ హైకోర్టుకు వెళ్తున్న తన వెహికల్ ఆపడంపై మండిపడ్డ ఆయన.. కరకట్ట రోడ్డుపై తన వెహికల్ ఆపడం ఏంటి? అని ప్రశ్నించారు.. ఏపీ హైకోర్టు కోర్టు 17లో నా మేటర్ ఉంది.. 20 నిముషాలు సమయం కోరాను.. బెంగుళూరు నుండి ఫైట్లు లేక ఆలస్యం అయ్యిందన్నారు.. ఏపీ…
Vadde Shobhanadreeswara Rao: అమరావతిలో రెండో విడత భూ సమీకరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి వడ్డే వడ్డే శోభనాద్రీశ్వర రావు.. అమరావతి రెండో విడత భూ సమీకరణపై రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ వేడి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో విజయవాడలో జరిగిన రౌండ్టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు, సీపీఎం నేత బాబురావు, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, సీపీఐ నేత వనజ పాల్గొన్నారు. ఈ సమావేశంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు చేసిన వ్యాఖ్యలు…
AP FiberNet Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై నమోదైన ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.. 2023లో ఫైబర్ నెట్ టెండర్లలో అక్రమాలు జరిగాయని సీఐడీ కేసు నమోదు చేసింది.. అయితే, ఈ కేసులో చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చారు.. అప్పుడు ఫైబర్ నెట్ చైర్మన్ గా పనిచేసిన గౌతమ్ రెడ్డి అక్రమాలపై ఎండీ మధుసూదన్ రెడ్డికి రాసిన లేఖను ఆయన విచారణ జరపాలని…
Deputy CM Pawan Kalyan: చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తిరుగు ప్రయాణంలో రైతులను చూసి కాన్వాయ్ దిగి వచ్చారు.. తిరుపతిలో దామినేడు నేషనల్ హైవేపై ప్రయాణిస్తున్న సమయంలో వర్షంలో ప్లే కార్డులతో ఎదురుచూస్తున్న రైతులను గమనించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెంటనే తన కాన్వాయ్ను ఆపి వారితో మాట్లాడారు.. రైతుల సమస్యలను శ్రద్ధగా విన్నారు.. Read Also: Deputy CM Bhatti Vikramarka: ప్రపంచం మొత్తం క్వాంటమ్…
Vangaveeti Asha Kiran: వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న విశాఖలో రంగనాడు పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాధా రంగ రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగనాడు పోస్టర్ ని రంగ కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంగవీటి ఆశా కిరణ్ మీడియాతో మాట్లాడారు. రాధా రంగ మిత్ర మండలి సభ్యులను చూస్తే ఒక కుటుంబాన్ని చూసినట్లుగా ఉందన్నారు. డిసెంబరు 26న విశాఖలో రంగా నాడు పేరు తో సభ…
Zakiya Khanum: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించి.. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవికి ఆరుగురు రాజీనామా చేయడం పెద్ద చర్చగా మారింది.. అయితే, రాజీనామా చేసిన ఎమ్మెల్సీ ఆ తర్వాత కూటమి పార్టీల్లో చేరారు.. అయితే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీగా రాజీనామా చేసి, తర్వాత బీజేపీలో చేరిన మండలి వైస్ చైర్పర్సన్ జకీయా ఖానుమ్, చివరి నిమిషంలో తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు.…
Off The Record: అదిగో కేస్ అన్నారు… ఇదిగో అరెస్ట్ అని ప్రచారం చేశారు. ఇంకేముంది, అంతా అయిపోయింది. ఆడుదాం ఆంధ్రాలో బీభత్సాలు జరిగిపోయాయి. కోట్లు కొల్లగొట్టేశారు. ఆ కేసులో మాజీ మంత్రి రోజాను అరెస్ట్ చేసేస్తున్నారంటూ ఒక దశలో తెగ హడావిడి చేశారు టీడీపీ లీడర్స్. కట్ చేస్తే…. ముఖచిత్రం వేరుగా ఉంది. ఇప్పుడసలు ఆ ఊసేలేదు. అక్రమాలు, అరెస్ట్లంటూ… అప్పట్లో నానా హంగామా చేసిన నాయకుల గొంతులన్నీ మూగబోయాయి. పైగా… అదే టైంలో ఆరోపణలు…