Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేడు కృష్ణా జిల్లా పెడనలో పర్యటించనున్నారు. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు చందు వీర వెంకట వసంత రాయల కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. జనసేన విడుదల చేసిన పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి బయలుదేరనున్న పవన్ కల్యాణ్.. ఉదయం 11.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 11.50 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.20 గంటలకు పెడనకు చేరుకోనున్నారు.
Read Also: Japan: మాజీ ప్రధాని షింజో అబే హత్య కేసులో నేడు తీర్పు.. మర్డర్ ఎప్పుడు, ఎలా జరిగిందో తెలుసా?
తదనంతరం మధ్యాహ్నం 1.50 గంటలకు పెడన నియోజకవర్గం, కృత్తివెన్ను మండలం పెద చందాల గ్రామానికి వెళ్లి మృతిచెందిన జనసేన కార్యకర్త కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు పవన్ కల్యాణ్.. ఇక, కార్యక్రమం అనంతరం, పవన్ కల్యాణ్ మధ్యాహ్నం 1.50 గంటలకు పెడన నుంచి బయలుదేరి సాయంత్రం 3.50 గంటలకు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు.