సగటు సినిమా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం అనే అంశం పై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానని దిల్ రాజు అన్నారు. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఆయన సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న పవన్ అభిప్రాయం అభినందనీయం. దీనిని మనమందరం స్వాగతించి, కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని అన్నారు. Also Read: Manchu Brothers: కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్సింగ్…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే – తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడినట్లు ఆయన ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. . ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తెలుగు సినిమా…
Sunil Kumar: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెండైన ఆయన పై ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్ ను నమోదు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎస్ అధికారిగా సర్వీసు నిబంధనల ఉల్లంఘనతో పాటు ఆయనపై నమోదైన వివిధ అభియోగాల మేరకు ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ నమోదు చేసారు. అప్పటి సీఐడీ చీఫ్ గా 2019 అక్టోబరు 24 నుంచి 2023 జనవరి…
ఆంధ్రప్రదేవ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను వైసీపీ నేతల బృందం కలిసింది. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు, అక్రమ కేసులు, వ్యవస్థల నిర్వీర్యంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ను కలిసిన వారిలో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు విడదల రజినీ.. వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు పలువురు నేతలు ఉన్నారు.
విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పచ్చజెండా ఊపారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 77వ సమావేశం అమరావతి అసెంబ్లీలోని పేషిలో మంత్రి లోకేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఇంటర్మీడియట్లో విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించి విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కాలేజీల వైపు ఆకర్షించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఏపీ ఫైబర్ నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్యను నియమించారు. అందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రవీణ్ ఆదిత్య ఏపీ మారిటైం బోర్డ్ సీఈఓగా ఉన్నారు. కాగా.. ఫైబర్ నెట్ ఎండీగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్, టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. టీడీపీకి, పార్టీ పదవులను కూడా వదులుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
CM Chandrababu: దావోస్‌లో పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలుగు కమ్యూనిటీ వారితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఏపీలో పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను ఆయన వివరిస్తూ అనేక అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నేడు అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్సీ (Artificial Intelligence) సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో “ఫిజికల్ వర్చువల్ రియాలిటీ”…
Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ వైయస్సార్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తాజాగా ఆయన కూటమి సర్కార్‌ను నిలదీస్తూ తన సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ సందేశాన్ని తెలిపారు. ఇక ఆ సందేశంలో పలు అంశాలపై సూటిగా ప్రశ్నించారు. ఇందులో ఏముందంటే.. చంద్రబాబు నాయుడు గారూ… ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన…
Dola Veeranjaneyulu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన పాపాలు రాష్ట్ర ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయని మంత్రి ఆరోపించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలపై జగన్ తన పార్టీ క్యాడర్‌తో కలిసి నిరసనలు తెలపడం ద్వారా సైకో వ్యూహాలకు పాల్పడుతున్నారని డోల ఆరోపించారు. “జగన్ ప్రభుత్వం APERC (ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ…