ఏపీ ఫైబర్ నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్యను నియమితులయ్యారు. అందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రవీణ్ ఆదిత్య ఏపీ మారిటైం బోర్డ్ సీఈఓగా ఉన్నారు. కాగా.. ఫైబర్ నెట్ ఎండీగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుత ఎండీ దినేష్ కుమార్‌ను జీఏడీకి అటాచ్ చేసింది ప్రభుత్వం. ఇదిలా ఉంటే.. దినేష్ వైఖరిపై నిన్న జీవీ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఏపీ ఫైబర్ నెట్ నూతన ఎండీగా ప్రభుత్వం ప్రవీణ్ ఆదిత్యను నియమించింది.
Read Also: Hyperloop: “3 గంటల్లోపే హైదరాబాద్ టూ ఢిల్లీ”.. “హైపర్‌లూమ్” రవాణాకు భారత్ సిద్ధం..
ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్, టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. టీడీపీకి, పార్టీ పదవులను కూడా వదులుకుంటున్నట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతో తెలుగు దేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హోదా, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవుల నుండి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Also: Minister Lokesh: వైసీపీ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతుంది..?