ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా హరి హర వీరమల్లు సినిమా టికెట్ రేట్లను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెల 24న (జులై 24, 2025) విడుదల కానున్న ఈ సినిమా పట్ల అభిమానులతో పాటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిర్మాతలు మొదటి రెండు వారాల పాటు టికెట్ రేట్ల పెంపు కోరగా, ప్రభుత్వం మొదటి పది రోజులకు మాత్రమే…
కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవ సభ ఎల్లుండి జరగనుంది. సుపరిపాలన.. తొలి అడుగు పేరుతో సభ నిర్వహించనున్నది ఏపీ ప్రభుత్వం. ఏపీ సచివాలయం వెనక ప్రాంతంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు.. భవిష్యత్తు కార్యాచరణ.. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ వివరించనున్నారు. ప్రభుత్వం ప్రాధాన్యాలు.. పి 4పై ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండనుంది. ఎమ్మెల్యేలు మంత్రులు మొదటి వార్షికోత్సవ సభలో…
ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన హామీలు అమలు చేయడం లేదంటూ గుడ్డిగా మాట్లాడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ. 3000 పెన్షన్ రూ. 4000 చేశామని తెలిపారు. అన్న క్యాంటీన్లు పెట్టామని.. మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. రానున్న రోజుల్లో ముందే అకౌంట్ లో డబ్బులు వేసేస్తామని స్పష్టం చేశారు.
Film Industry Meeting: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమకు సంబంధించి కీలక చర్చలకు రంగం సిద్ధమవుతోంది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా హాజరై నేతృత్వం వహించనున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వ వర్గాలు, ముఖ్యమంత్రి కార్యాలయం భేటీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సినిమాల్లో ఎదురవుతున్న సమస్యలు, ఏపీ రాష్ట్రంలో షూటింగ్‌లకు అనుమతులు, లొకేషన్ సమస్యలు, పన్నుల విధానం, ఇతర తాజా…
Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా “సుపరిపాలన… తొలి అడుగు” పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సభ ఈ రోజు (జూన్ 12) సాయంత్రం 5 గంటలకు విజయవాడ సమీపంలోని పోరంకి మురళి రిసార్ట్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రిమండలి సభ్యులు, కూటమి ఎమ్మెల్యేలు, తదితర ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు. అలాగే ప్రభుత్వ ఉన్నతాధికారులందరూ ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని…
Vizag Metro Train: విశాఖపట్నం మెట్రో రైల్ నిర్మాణానికి నిధుల సమీకరణపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ ప్రతినిధులు, మెట్రో కార్పొరేషన్ అధికారుల బృందం విశాఖలో పర్యటిస్తోంది. డబుల్ డెక్కర్ మోడల్ లో మూడు ఫేజ్ లలో చేపట్టే ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 14వేల కోట్లు ఖర్చు అంచనా వేశారు. ఈ మెట్రో ప్రాజెక్ట్ మూడు కారిడార్లలో 46.23 కి.మీ మేర మెట్రో వస్తుంది. నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం…
Astram App: విశాఖపట్నం నగర వాసులకు ట్రాఫిక్ సమస్యల నుండి ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర హోం మినిస్టర్ అనిత ‘అస్త్రం’ అనే యాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు రియల్ టైమ్ ట్రాఫిక్ సమాచారం అందించడమే ఈ యాప్ ఉద్దేశమని ఆమె తెలిపారు. Read Also: AP EAPCET 2025 Results: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ 2025 ఫలితాలు విడుదల..! ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్న వినియోగదారులు విశాఖలో ట్రాఫిక్ ఎక్కువగా…
Uttam Kumar Reddy : బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వ నిరసన కొనసాగుతోంది. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మరోసారి తమ స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఇప్పటివరకు కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేశాం. ఇంకా చేయాల్సినవి ఉంటే… అవి కూడా చేస్తాం. ఈ విషయంలో తాము ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు” అని మంత్రి స్పష్టం చేశారు. ఇక రెండు రోజుల్లో ప్రాజెక్టుపై మరింత…
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నెలలో 15 రోజులు, రెండు పూటలా రేషన్ సరకుల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు. ఆ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాలు గత ప్రభుత్వంలో మూసేసి, ఇంటింటికి అందిస్తాం అని రూ.1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేసిన విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.
రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ అరాచక, మోసపూరిత పాలనకు జూన్ 4కు ఏడాది అవుతుందని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు.. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఏడాదిలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. ప్రశ్నించే గొంతులు లేవకుండా భయోత్పాతాన్ని సృష్టించిన ప్రభుత్వం దేశ చరిత్రలోనే ఉండదన్నారు.