సైబర్ క్రైంలు, ఛీటింగ్‌లు జరగకుండా కంట్రోల్ చేయాలని.. రెండు టీంలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. డొమెస్టిక్ నాలెడ్జి ఉన్న వారిని, ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని టీంలో ఉండేలా చూసుకోవాలన్నారు. వచ్చే మూడు నెలల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ జరగాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వారంలోగా కమిటీలు, యాక్షన్ ప్లాన్ కావాలన్నారు. రియల్ టైంలో యూజ్ కేసులు తయారు చేసి, సీసీ కెమెరాలపై కంట్రోల్ చేయాలన్నారు.
గత ప్రభుత్వ హయాంలో మద్యంలో డిజిటల్ పేమెంట్లు లేకుండా చేశారని.. ఇంత పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడటం ఇదే మొదటి సారి అని సీఎం చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. మద్యం పైన సీఐడీ ఎంక్వైరీ జరుగుతోందన్నారు. ఇసుకపై సీనరేజీ తీసేసిన తరువాత పక్క రాష్ట్రాలకు వెళ్ళడం జరగకూడదన్నారు. ఎంత ఇసుక కావాలో అంతా ఉదయం పూటే దొరుకుతుందన్నారు.
నాలెడ్జ్ సొసైటీ మన లక్ష్యమని.. ఉన్నత విద్య అంశాలు ఏమిటనేది సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎడ్యుకేషన్, స్కిల్స్, ఉద్యోగాలు ఒక విజన్‌తో జరగాలన్నారు. రెండవ రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు కూడా అందరూ ముందుకు రావాలన్నారు.
ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన సిట్‌కు చీఫ్‌గా వినీత్ బ్రిజ్‌లాల్‌కు బాధ్యతలు అప్పగించారు. సీఐడీ ఎస్పీ ఉమామహేశ్వర్, డీఎస్పీలు అశోక్ వర్ధన్, బాలసుందర రావు, గోవిందరావు, రత్తయ్య.. మొత్తం చీఫ్ సహా ఆరుగురితో సిట్‌ను ఏర్పాటు చేసింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు అనుసరిస్తున్న విధానం సత్ఫలితాలను ఇస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలోని నాలుగు పంచాయతీలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. అత్యుత్తమ పనితీరును కనబరిచిన పంచాయతీలకు కేంద్ర సర్కారు ఇచ్చే జాతీయ స్థాయి పురస్కారాలుకు నాలుగు గ్రామాలు ఎంపిక కావడం విశేషం.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలక అంశాలకు ఆమోదం లభించింది. జలవనరుల శాఖలో జీవో 62 అమలుపై కేబినెట్‌లో చర్చ జరిగింది. గిరిజన ప్రాంతాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
మరి కొద్ది రోజులలో రిలీజ్ కాబోతున్న పుష్ప 2 సినిమాకి ఇప్పటినుంచి మంచి డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ఈ సినిమా టికెట్లు రేట్ల గురించి ఇప్పటినుంచే చర్చ జరుగుతుంది అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా సుకుమార్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు ఇక ఈ సినిమాకి సంబంధించి నైజాం ప్రాంతంలో ఒకరోజు ముందుగానే ప్రీమియర్…
CM Chandrababu : సీఎం నారా చంద్రబాబు నాయుడు నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా.. ఆయన లబ్దిదారులకు పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అనంతపురం జిల్లా నేమకల్లులో ఈరోజు చంద్రబాబు పర్యటించి పెన్షన్లు మంజూరు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. డిసెంబర్ నెలలో పెన్షన్ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. డిసెంబర్ 1న ఆదివారం కావడంతో, ఆ రోజు పెన్షన్ పంపిణీ చేయడం కష్టమైన…
ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి సమావేశం జరుగనుంది. అయితే.. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మండల స్థాయి అధికారులు పాల్గొననున్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి సమావేశంలో మంత్రులు, సెక్రటరీలు, హెచ్వోడీలు పాల్గొంటారు.
Pawan Kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ రోజు (బుధవారం) ఢిల్లీకి బయలుదేరతున్నారు. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత వెలగపూడి సచివాలయం నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి 3.30 గంటలకు ఢిల్లీ విమానానికి ప్రయాణం చేయి, 5:45 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. విమానాశ్రయ నుంచి నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసానికి చేరుకుని, 6:30 నుంచి 7 గంటల…