Film Industry Meeting: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమకు సంబంధించి కీలక చర్చలకు రంగం సిద్ధమవుతోంది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా హాజరై నేతృత్వం వహించనున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వ వర్గాలు, ముఖ్యమంత్రి కార్యాలయం భేటీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సినిమాల్లో ఎదురవుతున్న సమస్యలు, ఏపీ రాష్ట్రంలో షూటింగ్‌లకు అనుమతులు, లొకేషన్ సమస్యలు, పన్నుల విధానం, ఇతర తాజా అంశాలపై చర్చ జరగనుంది. అంతేకాకుండా, సినీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమాలోచనలు జరిగే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం నేతృత్వంలో 22వ తేదీ తర్వాత సమావేశం జరుగనున్నట్లు సమాచారం.
Read Also: Vijayawada: “సుపరిపాలన.. తొలి అడుగు” పేరుతో కూటమి ప్రభుత్వ వార్షికోత్సవ సభ..!
అయితే మరోవైపు మరికొన్ని వర్గాల నుండి వచ్చిన సమాచారం మేరకు ఈ నెల 15వ తేదీన (ఆదివారం) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సినీ పరిశ్రమ ప్రముఖులు కలవనున్నట్లు తెలుస్తోంది. విజయవాడ వద్ద ఉన్న ఉండవల్లి నివాసంలో ఈ భేటీ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కబుతున్నట్లు సమాచారం. చుడాలిమరి అధికారికంగా సమాచారం వచ్చేంతవరకు సమావేశం ఎప్పుడు, ఎక్కడ జరగనుందో..
Read Also: Body Found In Freezer: వెలుగులోకి మరో హనీమూన్ కేసు.. ఐస్ క్రీం ఫ్రీజర్‌లో శవం..