AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ!
- నేడు ఏపీ కేబినెట్ సమావేశం..
- సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న కేబినెట్..
- పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే ఛాన్స్..
- జిల్లాల పునర్విభజన, పేర్ల మార్పులపై చర్చ జరిగే అవకాశం..' కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సీఆర్డీఏ పరిధిలో అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు చేసే ఛాన్స్ ఉంది. రూ. 904 కోట్లతో రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతులు కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం. అలాగే, జిల్లాల పునర్విభజన, పలు జిల్లాల పేర్లు మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మంత్రి వర్గంలో చర్చించే అవకాశం ఉంది.
Read Also: MP: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ప్రియురాలిని కలిసేందుకు వచ్చిన యువకుడిపై 13 గంటలు దాడి
Also Read
అయితే, రాజధాని అమరావతిలో కొన్ని సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక, మంత్రి వర్గ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా పెరోల్ అంశంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహార శైలి, ఇతర అంశాలపై చర్చ జరగనుంది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, నిన్న జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన అంశంపై చర్చించనున్నారు. అలాగే, కొన్ని విషయాల్లో మంత్రులు జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Team India Mission 300: టీమిండియా ‘మిషన్ 300’.. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!
-
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
-
CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..