Vizag Metro Train: విశాఖపట్నం మెట్రో రైల్ నిర్మాణానికి నిధుల సమీకరణపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ ప్రతినిధులు, మెట్రో కార్పొరేషన్ అధికారుల బృందం విశాఖలో పర్యటిస్తోంది. డబుల్ డెక్కర్ మోడల్ లో మూడు ఫేజ్ లలో చేపట్టే ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 14వేల కోట్లు ఖర్చు అంచనా వేశారు. ఈ మెట్రో ప్రాజెక్ట్ మూడు కారిడార్లలో 46.23 కి.మీ మేర మెట్రో వస్తుంది. నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం భరిస్తుంది. మిగిలిన మొత్తం కేంద్రం సహాయం, ప్రవేట్ రుణంగా సమకూర్చుకోనుంది.
ఇందు కోసం KFW, AFD, ADB, NDB, AIIB, జైకా వంటివి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ ప్రతినిధులు బృందం క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్ళింది. మెట్రో రైల్ కార్పోరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి స్వయంగా మెట్రో ప్లానింగ్, స్టేషన్ ల నిర్మాణం, వయ బులిటీపై బ్యాంక్ ప్రతినిధులకు వివరిస్తున్నారు. వైజాగ్ మెట్రో తొలి దశలో 46.23 కి.మీల మేర మూడు కారిడార్లు నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఇందులో మొదటి కారిడార్ విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు దాదాపు 34.4కి.మీల మేర, అలాగే గురుద్వార్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు 5.08కి.మీల మేర రెండో కారిడార్, ఇక చివరిగా తాటిచెట్ల పాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75 కి.మీల మేర మూడో కారిడార్ నిర్మాణం పనులు చేపట్టనున్నారు.
Read Also: Chintha Chiguru: అనేక రోగాలకు దివ్య ఔషధంగా చింత చిగురు..!