ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన హామీలు అమలు చేయడం లేదంటూ గుడ్డిగా మాట్లాడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ. 3000 పెన్షన్ రూ. 4000 చేశామని తెలిపారు. అన్న క్యాంటీన్లు పెట్టామని.. మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. రానున్న రోజుల్లో ముందే అకౌంట్ లో డబ్బులు వేసేస్తామని స్పష్టం చేశారు. తల్లికి వందనం విషయం లో ప్రతిపక్షం నిద్రపోతున్నట్టు నటిస్తున్నారని విమర్శించారు. మీరు ఇచ్చిన జీవో ప్రకారమే 2000 రూపాయిలు స్కూల్ అభివృద్ధికి వినియోగిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం మీద తప్పుడు సమాచారం ఇచ్చినా , తప్పుడు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తల్లికి వందనం 2000 రూపాయలు లోకేష్ జాబులోకి వెళ్లాయని తప్పుడు విమర్శలు చేశారని చెప్పారు. తల్లికి వందనం డబ్బులు నాకు వచ్చినట్లు నిరూపిస్తే రాజకీయం నుంచి తప్పుకుంటాను అని నారా లోకేష్ చాలెంజ్ చేస్తే ఉలుకు పలుకు లేకుండా ఉన్నారని మండిపడ్డారు.
READ MORE: Union Minister Piyush Goyal: పొగాకు రైతుల పిల్లలకు జపనీస్, జర్మన్, చైనా భాషలను నేర్పుతాం..
రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి సంబంధం లేదని.. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మొత్తం డబ్బు అమరావతికి పెట్టేస్తున్నారని కొంతమంది పిచ్చోలు తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగిల్ పైసా పెట్టడం లేదని.. రైతులు ఇచ్చి 34 వేల ఎకరాల భూమి ప్రభుత్వం వాడుకోగా కొంత పార్ట్ రైతులకు ఇచ్చామని తెలిపారు. మిగిలిన 9 వేల ఎకరాల పై బ్యాంకులో బ్రేడ్జ్ పెట్టి రుణం తీసుకొని అమరావతి నిర్మిస్తున్నామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని అమరావతి నిర్మిస్తామన్నారు. మొత్తం రికార్డులు చూసుకోండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా పెట్టడం లేదని మరోసారి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎలాంటి పిచ్చి వాళ్లతో సమస్య రాకుండా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చట్టం చేస్తామన్నారు.అమరావతి ఆంద్రప్రదేశ్ రాజధాని అని చట్టం తీసుకు వస్తున్నామని.. మూడు సంవత్సరాల లో అమరావతి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
READ MORE: Upcoming Smartphones: ఈ రెండు చౌకైన 5G ఫోన్‌లు వచ్చే వారం విడుదల.. కేక పుట్టించే ఫీచర్లు