గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు.. పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదు. టీడీపీతో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. ఇప్పుడు ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉందనగా యాక్టివ్ పాలిటిక్స్ ప్రారంభించారు ఈ మాజీ మంత్రి. కానీ.. ఆయన వేస్తున్న అడుగులకు.. క్రియాశీలకంగా మారేందుకు చేస్తున్న ప్రయత్నాలకు టీడీపీలోని ప్రత్యర్థులు చెక్ పెడుతున్నారు. దీంతో గంటా ప్రతీ కదలిక ఆసక్తిగా మారుతోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఉత్తరాంధ్ర నుంచి బాదుడే.. బాదుడు నిరసన టూర్ చేపట్టారు. విశాఖ…
ఏపీలో వైసీపీ నాయకుల పరిస్థితి సిలబస్ పూర్తి చేసుకుని రివిజన్ చేసుకుంటున్న విద్యార్ధుల్లా ఉంది. మూడేళ్లు ప్రభుత్వ పాలనను రివైజ్ చేసుకుంటూనే.. వచ్చే రెండేళ్లు ఎన్నికలకు సమాయత్తం అవుతోంది పార్టీ. ఈ మూడేళ్లలో ప్రభుత్వ పనితీరే కాదు ఎమ్మెల్యేల పనితీరు కూడా కీలకమే. అందుకే పార్టీ హైకమాండ్ కొద్దిరోజులుగా సర్వేల ప్రక్రియ చేపట్టింది. చాలా మంది ఎమ్మెల్యేల ప్రొగ్రస్ రిపోర్ట్ 40 నుంచి 45 శాతం దాటడం లేదని.. సరి చేసుకోవాలని పార్టీ అధినేత సీఎం జగన్…
శంకర నారాయణ. మాజీ మంత్రి. పెనుకొండ ఎమ్మెల్యే. కేబినెట్‌లో చోటు కోల్పోయిన తర్వాత శ్రీసత్యసాయి జిల్లాకు వైసీపీ అధ్యక్షుడయ్యారు. ఆయనకు పార్టీ బాధ్యతలు కొత్త కాదు. గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు సుదీర్ఘకాలంపాటు ఆయనే వైసీపీ చీఫ్. నిన్న మొన్నటి వరకు ఉమ్మడి జిల్లాకు పార్టీ అధ్యక్షుడు. ఆ సమయంలో పార్టీలో ఎక్కడా.. ఎవరి మధ్యా విభేదాలు కనిపించలేదు. మాజీ మంత్రిగా కొత్త బాధ్యతలు చేపట్టాక అసలు సిసలైన రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నారు శంకర నారాయణ. వాటిపైనే…
నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. గతంలో జనరల్ సెగ్మెంట్‌గా ఉన్నప్పుడు 1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడమే ఆఖరు. ఆ తర్వాత నందికొట్కూరులో టీడీపీ జెండా ఎగిరింది లేదు. 2004లో కాంగ్రెస్ నుంచి గౌరు చరిత గెలిచారు. 2009కి వచ్చేసరికి నియోజకవర్గాల పునర్విభజనలో నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్డ్ అయింది. 2012లో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి టీడీపీకి రాజీనామా చేశాక సైకిల్ పార్టీ పూర్తిగా బలహీనపడింది. ఎస్సీ సామాజికవర్గంలో టీడీపీకి బలమైన నాయకుడు లేకపోవడం పెద్ద…
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో మెట్ట రాజకీయాలు డిఫరెంట్. ఇందులో జగ్గంపేట రాజకీయాలు ఇంకా ఆసక్తికరం. గడిచిన నాలుగు ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే రెండుసార్లు కాంగ్రెస్, మరో రెండుసార్లు వైసీపీ గెలిచాయి. అభ్యర్థులు ఎవరైనప్పటికీ పార్టీలే జగ్గంపేటలో కీలకమని టాక్. 2004, 2009 ఎన్నికల్లో వరసగా రెండుసార్లు మాజీ మంత్రి తోట నరసింహం కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత 2014, 2019 ఎన్నికల్లో జగ్గంపేట ప్రజలు వైసీపీని గెలిపించారు. 2004లో టీడీపీ నుంచి 2009లో పీఆర్పీ…
చీరాల మాజీ ఎమ్మెల్యే పాలేటి రామారావు పార్టీ మార్పుపై చాలాకాలం నుంచి వదంతులు షికారు చేస్తున్నాయి. గతంలో టీడీపీ నుంచి రెండుసార్లు గెలిచిన పాలేటి.. పలు పార్టీలు మారి ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్‌తో కలసి వైసీపీ కండువా కప్పుకొన్నారు. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో.. ఎవరికి మద్దతుగా నిలుస్తారో చెప్పలేమన్నది అభిమానుల మాట. ఆ మధ్య కొంతకాలం ఎమ్మెల్యే బలరామ్‌తో కొంత గ్యాప్ వచ్చినా మళ్లీ…
లావు శ్రీకృష్ణదేవరాయులు. నరసరావుపేట వైసీపీ ఎంపీ. ఇదే ప్రాంతానికి చెందిన మరో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతల చుట్టూ నరసరావుపేట వైసీపీ రాజకీయం ఆసక్తిగా మారుతోంది. ఒకరు ఎగ్జిట్ అయ్యి.. ఇంకొకరు ఎంట్రీ ఇస్తారనే చర్చ అధికారపార్టీ వర్గాల్లో ఊపందుకుంది. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కేంద్రంగా జరుగుతున్న ప్రచారం.. చర్చలు మరెంతో ఉత్కంఠ రేపుతోంది. మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి 2009లో నరసరావుపేట టీడీపీ ఎంపీ. 2014కు వచ్చేసరికి గుంటూరు పశ్చిమ నుంచి…
ఉమ్మడి అనంతపురం జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. ప్రస్తుతం ఆ పార్టీ విబేధాలతో కొట్టుమిట్టాడుతోంది. ఇక ఉమ్మడి జిల్లాలో 12 చోట్ల గెలిచిన వైసీపీలో.. లోకల్‌గా గుర్తించని అంశాలు చాలా ఉన్నాయి. వైసీపీలోనూ ఒక రేంజ్లో అంతర్గత కలహాలు నడుస్తున్నాయి. అవి పార్టీ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో ఒక్కసారిగా బయటపడ్డాయి. అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, శ్రీ అన్నమయ్య జిల్లాలకు వైసీపీ కోఆర్డినేటర్‌గా ఉన్నారు పెద్దిరెడ్డి. ఆ హోదాలో ఆయన తొలిసారి జిల్లాకు రాగానే షాక్…
అయ్యన్నపాత్రుడు. ఇద్దరు మాజీ మంత్రులు సుదీర్ఘ కాలంగా ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కలిసి సాగిన సందర్భాలు లేవు. 2014-19 మధ్య అయ్యన్న, గంటా ఇద్దరు చంద్రబాబు కేబినెట్ మంత్రులు. ఆ సమయంలోనూ ఒకే వేదికను పంచుకున్న సందర్భాలు అరుదే. ఒకరిని ఇరుకున పెట్టేందుకు మరొకరు ఎత్తులు పైఎత్తులు వేసుకునేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయ్యన్న గళం విప్పుతుంటే.. రెండున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో నాలుగుసార్లు పార్టీ మారిన చరిత్ర గంటాది. విశాఖ…
వెలంపల్లి శ్రీనివాస్. తాజా మాజీ మంత్రి. పదకొండు మందికి కేబినెట్‌లో తిరిగి చోటు దక్కినా.. ఆ జాబితాలో తాను లేకుండా పోయానని కొత్తలో కొంత బాధపడ్డారట వెలంపల్లి. ఇప్పుడా బాధ నెమ్మదిగా పోతున్నట్టే ఉంది. రోజువారీ కార్యక్రమాలు.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి డివిజన్‌లోనూ టూర్ వేస్తూ.. మళ్లీ గెలుపొందే ప్రయత్నాలు చేస్తున్నారట. మినిస్టర్ పోస్ట్ పోయినా.. హ్యాపీగా ఉండటానికి చాలా కారణాలు చెబుతున్నారు ఆయన అనుచరులు. గతంలో ఆయన చేపట్టిన మంత్రి పదవి వల్ల నియోజకవర్గంలో…