ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గ వైసీపీ రాజకీయాలు ఎప్పుడు హాట్ హాటే. ఆ నియోజకవర్గంలో మొదటి నుంచి వైసీపీ రెండు గ్రూపులుగా విడిపోయి ఉండటం, పార్టీ ఇంచార్జ్ గా ఎవరు వచ్చినా ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంతో, మిగిలిన వారు వైరి వర్గంగానే ఉండాల్సి వస్తోందట. నిన్నటి వరకూ ఆ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ గా మాదాసి వెంకయ్య బాధ్యతలు చూశారు. స్వతహగా డాక్టర్ అయిన వెంకయ్య 2019 ఎన్నికలకు మందు వైసీపీలో చేరి కొండేపి టిక్కెట్ తెచ్చుకోగలిగారు. అంతకుముందు ఆ నియోజకవర్గంలో పార్టీ ఇంచార్జ్ గా ఉన్న వరికూటి అశోక్ బాబుతో సయోధ్య కుదరక పోవటంతో రెండు గ్రూపులుగానే వైసీపీ కార్యకర్తలు కొనసాగుతున్నారట.
మరోవైపు ఓడిన వెంకయ్యకు, డీసీసీ బ్యాంక్ చైర్మన్ గిరీని కట్టబెట్టింది అధిష్టానం. ఇంచార్జ్ పదవి లేకపోయినా, చివరి నిమిషం వరకు, పట్టువదలని విక్రమార్కుడిలా ఎప్పటికైనా ఛాన్స్ రాకపోతుందా అని టంగుటూరులోనే మకాం ఏర్పాటు చేసుకున్న అశోక్ బాబు, తన వర్గంతో ఏదోఒక పార్టీ కార్యక్రమం చేసుకుంటు పోతున్నారట. అయితే ఇటీవల నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు ఇంచార్జ్ వెంకయ్యను లెక్కచేయక పోవటం, ఆయన ముందే బాహాబాహికి దిగటం… ఆయనపై ప్రెస్ మీట్లు పెట్టి మరి విమర్శించే పరిస్దితికి రావటంతో ప్రతిపక్ష టీడీపీకి అది ఓ అస్త్రంగా మారింది..విజువల్స్
నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లో దాదాపు ఇదే పరిస్ధితి ఏర్పడిందట. పార్టీ కార్యకర్తలే ఇంచార్జ్ ను లెక్కచేయక పోవటం, ఆయన కూడా కార్యకర్తలను అదుపు చేయలేకపోవటంతో, ఎలాగైనా ఈసారి ఆ నియోజకవర్గంలో గెలవాలని పట్టుదలతో ఉన్న ఆ పార్టీ అధిష్టానం, ఇంచార్జ్ ను మార్చి పార్టీ స్పీడ్ పెంచాలని భావించిందట. కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తే వారు అన్నీ సర్దుకుని పార్టీని గాడిలో పెట్టేందుకు సమయం సరిపోదనుకున్నారో ఏమో కానీ, 2019 వరకూ ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు నిర్వహించిన వరికూటి అశోక్ బాబుకే మరోసారి అవకాశం ఇచ్చింది. వైసీపీ మూడు జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని అనుచరుడిగా ముద్ర ఉన్న అశోక్ బాబుకు ఆయనతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఇంచార్జ్ పదవి రావడానికి కారణమట
వెంకయ్య తన వంతుగా గట్టిగానే ప్రయత్నం చేశారట. మార్పును అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించినా సాధ్య పడలేదట. వైసీపీ అధిష్టానం ఇంచార్జ్ మార్పును ప్రకటించటం.. అశోక్ బాబు నియోజకవర్గంలోకి రావటం… తనకున్న అనుచర గణంతో పార్టీ పిలుపునిచ్చిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేశారట. కార్యక్రమానికి మాజీమంత్రి, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేనితో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి హాజరయ్యారట. అయితే కార్యక్రమానికి వెంకయ్య, వైసీపీ వైద్యవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టరు అశోక్‌రెడ్డి, ఆయన సతీమణి, ఆర్టీసీ నెల్లూరు రీజియన్ ఛైర్‌పర్సన్ సుప్రజారెడ్డి హాజరుకాలేదు. నియోజకవర్గంలో మిగిలిన అన్ని మండలాలకు చెందిన ముఖ్య నాయకులంతా స్థానిక విభేదాలకతీతంగా కార్యక్రమంలో పాల్గొన్నారట. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బుర్రా మధుసూదన్ యాదవ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి కూడా మాదాసి హాజరు కాలేదట. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ఇంచార్జులు, ముఖ్య నేతలు కూడా హాజరయ్యారట. ఒక్క వెంకయ్య మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవటంతో, ఆయన అకస్మాత్తుగా తనకు ఇంచార్జ్ పదవిని తొలగించటం, ఇప్పటి వరకూ పార్టీలో తనకు ప్రత్యర్దిగా ఉన్న వ్యక్తికే బాధ్యతలు అప్పగించటంతో అలిగిన వెంకయ్య, పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారట…విజువల్స్
మాత్రం తన వర్గంగా ఉన్న కొందరు ద్వితీయ శ్రేణి నేతలకు అందుబాటులో ఉన్నా మిగతా వారికి అందుబాటులోకి రాలేదట వెంకయ్య. ఆయన పార్టీ అధిష్టానంపై అలగటం వల్లే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారట. ఇప్పటి వరకూ వెంకయ్యకు సముచిత స్ధానాన్ని ఇచ్చిన విషయాన్ని ఆయన అనుచరులకు అగ్రనేతలు గుర్తు చేశారట. వెంకయ్యను బుజ్జగించే పనిని పార్టీ నూతన జిల్లా అధ్యక్షుడు బుర్రా మధుసూధన్ కు ఇచ్చారట. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిరోజే వచ్చిన మొదటి టాస్క్ ను బుర్రా ఏ మేరకూ సఫలం చేస్తారో చూడాలి.