కాపు రిజర్వేషన్ అంశం ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్కే. తాజాగా కాపు రిజర్వేషన్ల గురించి రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈ అంశాన్ని ప్రస్తావించారు. కాపులకు ఓబీసీ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. ఏపీలో కాపులు సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడి వున్నారని ఆయన అన్నారు. మూడు దశాబ్దాలుగా తమకు న్యాయం జరగాలని కాపులు ఉద్యమాలు చేశారన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినా కాపుల విషయంలో…
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? వస్తే పార్టీలన్నీ రెడీగా వున్నాయా? అంటే అవుననే అంటున్నాయి. తాజాగా ఏపీలో టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబునాయుడు దీనిపై మనసులో మాట బయటపెట్టారు. మీడియాతో చిట్ చాట్ చేశారు చంద్రబాబు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నా అన్నారు. అనేక మంది సీఎంలు పని చేసినా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన సీఎం ఎవ్వరూ లేరు.రాష్ట్రంలో ఇప్పుడు ఆర్థిక విధ్వంసం జరుగుతోంది. ఏపీ బ్రాండ్ ఇమేజీని దెబ్బ తీశారు. పారిశ్రామిక…
ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. నాడు ఉద్యోగుల ఓట్ల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చారు. నేడు మాట మార్చుడు, మడమ తిప్పుడుకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు సీఎం జగన్ అంటూ మండిపడ్డారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్న మాటకి రెండున్నరేళ్ళు అయినా దిక్కు లేదు. పైగా జగన్ కు అవగాహన లేకే సిపిఎస్ రద్దు చేస్తామనే హామీ ఇచ్చారంటూ స్వయంగా…