ఏపీలో వరదలు బీభత్సం సృష్టిస్తే ఇప్పటి వరకు కేంద్రం సహాయం అందించలేదని.. కేంద్రం తీరు అన్యాయంగా ఉందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావు అన్నారు. పార్లమెంట్లో ప్రజా సమస్యలపై పోరాడుతుంటే కనీసం వైసీపీ మాట్లాడటం లేదని మండిపడ్డారు.
పోర్ట్ సిటీ విశాఖపట్నంలో అధికార వైసీపీ రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. తూర్పు, దక్షిణ నియోజకవర్గాల కుమ్ములాటలు కొలిక్కి రాకముందే పశ్చిమంలో ముసలం పుట్టింది. మాజీ ఎమ్మెల్యే, ఏపీ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ విజయప్రసాద్‌కు హైకమాండ్ షాక్ ఇచ్చింది. పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పించి ఆ స్ధానంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌ను నియమించింది. “గడపగడపకు” ప్రభుత్వం కార్యక్రమం సమన్వయం చెయ్యాలని శ్రీధర్‌కు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి.…
ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గ వైసీపీ రాజకీయాలు ఎప్పుడు హాట్ హాటే. ఆ నియోజకవర్గంలో మొదటి నుంచి వైసీపీ రెండు గ్రూపులుగా విడిపోయి ఉండటం, పార్టీ ఇంచార్జ్ గా ఎవరు వచ్చినా ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంతో, మిగిలిన వారు వైరి వర్గంగానే ఉండాల్సి వస్తోందట. నిన్నటి వరకూ ఆ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ గా మాదాసి వెంకయ్య బాధ్యతలు చూశారు. స్వతహగా డాక్టర్ అయిన వెంకయ్య 2019 ఎన్నికలకు మందు వైసీపీలో చేరి కొండేపి టిక్కెట్…
ఆరు నియోజకవర్గాలు కలిగిన విశాఖపట్టణంజిల్లా ప్రధాన రాజకీయపార్టీలకు ఆయువు పట్టు. సంస్ధాగతంగా పార్టీల బలోపేతంపై టీడీపీ, వైసీపీ ఫోకస్ పెంచాయి. సోషల్ ఇంజనీరింగ్‌లో పది అడుగులు ముందేవున్న వైసీపీ.. కీలకమైన జిల్లా అధ్యక్ష పదవిలో మార్పు చేసింది. మూడేళ్లు మంత్రిగా ఉన్న భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. తొలిసారి పార్టీని నడిపించే అవకాశం లభించడంతో అవంతి సైతం ప్రతిష్టాత్మకంగానే భావిస్తున్నారు. కానీ, క్షేత్రస్ధాయిలో పార్టీ పరిస్ధితులు అవంతికి ఏ మాత్రం కొరుకుడుపడ్డం లేదనేది…
ఎన్నికలకు ఇంకా రెండేళ్లు గడువు ఉన్నా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధాన పార్టీలలో హడావిడి మొదలైంది. సీట్ల మార్పులు చేర్పులపై చర్చలు జోరందుకున్నాయి. ఈ తరహా చర్చలు టీడీపీలో కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ప్రత్యేకించి సీనియర్లలో చాలా టెన్షన్ కనిపిస్తోందట. దశాబ్దాలుగా టీడీపీలో ఉంటూ పదవులు పొందిన నాయకుల సీటుకే ప్రస్తుతం ఎసరు వచ్చినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయట. దానికి తగ్గట్టుగానే అధినేత చంద్రబాబు కామెంట్స్ ఉంటున్నాయట. ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్లు.. చంద్రబాబుతోపాటు..…