Boy dies with Hot Tea: తల్లి దండ్రులు చేసిన ఓ పొరపాటు నాలుగేళ్ల బాలుడి ప్రాణం తీసింది.. మంచినీరు అనుకుని పొరపాటును వేడి వేడి టీ తాగడంతో ఆస్పత్రి పాలైన బాలుడు.. చికిత్స పొందుతూ చివరకు ప్రాణాలు విడిచాడు.. అనంతపురం జిల్లా యాడికిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యాడికిలోని చెన్నకేశవస్వామి కాలనీలో రామస్వామి, చాముండేశ్వరి దంపతులు నివాసం ఉంటున్నారు.. వీరికి నాలుగేళ్ల రుత్విక్, రెండేళ్ల వయస్సు ఉన్న యశస్విని అనే…
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆడబిడ్డలపై జరిగిన రెండు ఘటలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.. అనంతపురం పట్టణంలో ఇంటర్ విద్యార్థిని హత్య, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగురాళ్లపల్లిలో బాలికపై అత్యాచారం ఘటనపై సీఎం సమీక్షించారు. రెండు ఘటనలపై డీజీపీ సహా ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి దర్యాప్తు అంశాలను వివరించారు.
అనంతపురం జిల్లాలో టీడీపీ నేతపై దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది.. పెద్దపప్పురు మండలం తిమ్మనచెర్వుకి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కట్టుబడి మనోజ్ పై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల డ్రైవర్ రాజు, అతని తమ్ముడు కలిసి దాడికి పాల్పడ్డారు.. ఈ ఘటనలో మనోజ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి.. అతడి శరీరంపై కత్తిగాట్లు కనిపిస్తున్నాయి..
ఆంధ్రప్రదేశ్‌లో ఓ యూట్యూబర్ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు.. అనంతపురం జిల్లాలో ఈ ఘటన జరిగింది.. గుంతకల్ మండలం బుగ్గ సంఘాల గ్రామ సమీపంలో గత రెండు రోజుల క్రితం అదృశ్యమైన యూట్యూబర్ తిరుమలరెడ్డి.. మంగళవారం కసాపురం గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద శవమై తేలాడు..
గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లిలో సోమవారం రాత్రి ఓ వివాహ వేడుకలో భోజనం వడ్డించే విషయంలో మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఒక వర్గం మరో వర్గంపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు.
జేసీ వ్యవహారంలో తాడిపత్రి అర్బన్ సీఐ, ఓ వ్యక్తి మధ్య సాగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. వేరేవాళ్లతో ఫోన్ చేయించి జేసీ ప్రభాకర్‌రెడ్డి తనను బెదిరిస్తున్నాడన్న రాంపులయ్య అనే వ్యక్తి.. తనకు జేసీ ఫోన్ నంబర్ కావాలంటూ సీఐ సాయిప్రసాద్‌ను అడగడంతో.. ఇద్దరి మధ్య మాటామాట పెరిగిపోయింది.. చివరకు అసభ్యపదజాలంతో దూషించుకోవడం వరకు వెళ్లింది..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు, నష్టాలు ఉంటాయి.. కేసులుకూడా పెడతారు, జైళ్లలో కూడా పెడతారన్న జగన్.. ప్రతి కష్టానికి ఫలితం ఉంటుంది, చీకటి తర్వాత వెలుగు కూడా వస్తుంది.. ఏ కష్టం ఎవరికి ఎప్పుడు వచ్చినా.. నావైపు చూడండి.. 16 నెలలు నన్ను జైళ్లో పెట్టారు.. నా భార్య కనీసంగా 20 సార్లు బెయిల్ పిటిషన్ పెట్టి ఉంటుంది.. కింద కాంగ్రెస్, పైన కాంగ్రెస్.. ఇన్ని కష్టాలు పెట్టినా.. నేను ముఖ్యమంత్రిని కాలేదా? ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని…
సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.. ఎలా బెదిరిస్తే.. తమ ఉచ్చులో పడతారు..? ఎలా వారిన తమ దారిలోకి తెచ్చుకోవాలి.. ఎలా అందినకాడికి దండుకోవాలనే విషయంలో రోజుకో కొత్త వ్యూహంతో సైబర్ నేరగాళ్లు వల విసిరుతున్నారు.. తాజాగా, అనంతపురం జిల్లా గుత్తికి చెందిన రైల్వే ఉద్యోగికి రూ.72 లక్షల కుచ్చుటోపీ పెట్టారు సైబర్ నేరగాళ్లు.
Pandu Ranga Temple: ఇటీవల మద్యానికి బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. మద్యం తాగడం మానేయడానికి కుటుంబ సభ్యులు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు.