AP Crime: ఆంధ్రప్రదేశ్‌లో ఓ యూట్యూబర్ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు.. అనంతపురం జిల్లాలో ఈ ఘటన జరిగింది.. గుంతకల్ మండలం బుగ్గ సంఘాల గ్రామ సమీపంలో గత రెండు రోజుల క్రితం అదృశ్యమైన యూట్యూబర్ తిరుమలరెడ్డి.. మంగళవారం కసాపురం గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద శవమై తేలాడు.. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి.. ఆ స్థలానికి పరిశీలించారు.. యూట్యూబర్ తిరుమలరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు పలు కోణాలలో దర్యాప్తు చేపట్టారు. వృత్తిరీత్యా వివాదాలతో హత్య చేశారా..? భూ వివాదంతో హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు తిరుమల్ రెడ్డి.. కర్నూలు జిల్లా మద్దికేర వాసిగా చెబుతున్నారు పోలీసులు.
Read Also: Pawan Kalyan: మహకుంభమేళాలో పుణ్యస్నానం చేసిన పవన్ దంపతులు