వైపీపీ నేత, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అనంతపురం జిల్లా రాప్తాడులోని ఆయన నివాసానికి పోలీసులు వచ్చారు. ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగారు. ఫోన్ కూడా స్విచ్ఛాప్‌లో ఉంది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా పాపి రెడ్డిపల్లిలో హెలిప్యాడ్ దగ్గర చోటు చేసుకున్న పరిణామాలపై తోపుదుర్తితో పాటు పలువురు వైసీపీ నాయకులపై కేసు నమోదైంది. ఈ కేసులో తోపుదుర్తిని అరెస్టు చేసేందుకు పోలీసులు ఇంటికి వెళ్లారు. కానీ తోపుదుర్తి అందుబాటు లేరు. మాజీ ఎమ్మెల్యే కోసం కుటుంబ సభ్యుల్ని ఆరా తీయగా.. ఎక్కడికి వెళ్లారో తెలియదని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లి ముందస్తు బెయిల్ కు తోపుదుర్తి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బెయిల్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Inter Admissions : మొదలైన తెలంగాణ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల సందడి
ఇక ఇదే కేసులో పైలెట్ అనిల్ కుమార్‌కు రెండో నోటీసు ఇచ్చారు. మే 2న చెన్నెకొత్తపల్లిలోని రామగిరి పోలీస్ సర్కిల్ కార్యాలయానికి కచ్చితంగా రావాలని నోటీసులో పేర్కొన్నారు. ప్తెలెట్ అనిల్ కుమార్ విచారణకు హాజరు అవుతారా… లేదా? అన్న దానిప్తె సందిగ్థత నెలకొంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు అవుతానని పోలీసులను ప్తెలెట్ అనిల్ తరపు న్యాయవాదులు కోరినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: YS.Jagan: నేడు స్థానిక ప్రతినిధులతో జగన్ భేటీ.. అనంతరం బెంగళూరుకు పయనం