మొన్న తెలుగు పేపరు … నిన్న హిందీ … ఇవాళ ఇంగ్లీష్ పేపర్ లీక్ అంటూ జరుగుతున్న ప్రచారం సత్యసాయి జిల్లాకు ప్రాకింది.తాజాగా ఆమడగూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ కలకలం రేపింది. అప్రమత్తం అయిన జిల్లా అధికారుల ఘటన పై విచారణకు ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ఆమడగూరులో 10గంటల సమయంలో పదవ తరగతి ఇంగ్లీష్ పేపర్ స్థానిక వాట్సప్ గ్రూపులో చక్కర్లు కొట్టింది.స్థానికంగా పేపర్ లీక్ అయిందన్న…
రాజకీయాల్లో పదవుల కోసం ఆశపడడం, అవి లభించకపోతే అసహనానికి, అసంతృపికి గురికావడం షరా మామూలే. కానీ అనంతపురం జిల్లాలో ఇద్దరు నేతల తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వారిద్దరూ మంత్రి ఆశించి భంగపడ్డారు. నిరాశ నిస్పృహలతో ఉంటారనుకుంటే.. జిల్లాలోకి భారీగా హంగామాతో ఎంట్రీ ఇచ్చారు. భారీ కాన్వాయిలు, గజ మాలలతో ఎంట్రీ ఇచ్చారు. తూచ్.. మంత్రి పదవి కాదు మాకు కావలసింది.. మాకు అసంతృప్తి లేదు.. పార్టీనే ముఖ్యమంటూ సందేశాలు ఇస్తున్నారు. అనంతలో ఇద్దరు నేతలు చేసిన తీరు…
ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రైతు సంక్షేమ యాత్రలో భాగంగా ధర్మవరం, బత్తలపల్లి ప్రాంతాల్లో పర్యటించనున్న ఆయన.. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు.. అంతేకాదు.. కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం చేయనున్నారు జనసేనాని.. సత్యసాయి, అనంతపురం జిల్లాలోని ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఆర్ధిక సాయం అందించి వారిలో ధైర్యం నింపేందుకు రైతుల కోసం తలపెట్టిన కౌలు రైతుల భరోసా యాత్రను మొట్టమొదటగా పవన్ కళ్యాణ్.. ఇవాళ…
అనంతపురం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఎక్కడికక్కడ టీడీపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పుట్టపర్తిలోని స్మశానవాటికలో హెల్త్ క్లినిక్ నిర్మించాలంటూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వైసీపీ సర్కారు నిర్ణయంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. స్మశాన వాటికలో హెల్త్ క్లినిక్ నిర్మించడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సమాధులు తవ్వేసి చదును చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. Read Also: తగ్గేదేలే అంటున్న ఒమిక్రాన్… దేశంలో 3వేలు దాటిన కేసులు ఈ…
ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, వివాహితులు, విద్యార్ధినులకు వేధింపులు తప్పడంలేదు. తమ కోరిక తీర్చాలంటూ నానా యాగీ చేస్తున్నారు. అనంతపురంలో ఓ గిరిజన యువతిని వేధిస్తున్నాడో యువకుడు. తన కోరిక తీర్చాలని లేకుంటే… ఆ అమ్మాయితో పాటు తన కుటుంబాన్ని కూడా చంపేస్తానంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు. కట్టుకున్న భర్తకు లేనిపోని మాటలు చెప్పి అమె భర్తను కాకుండా చేసి నేడు విడాకులు కావాలంటూ భర్త తరపు కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారు. తనకు తన కుటుంబానికి న్యాయం…
జగన్ ప్రభుత్వానికి, వైసీపీ నేతలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో ఎయిడెడ్ కాలేజీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయగా.. వారిని పరామర్శించేందుకు లోకేష్ బుధవారం ఉదయం అనంతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ నేతలు ఘనస్వాగతం పలకగా.. అనంతరం ప్రభుత్వం తమపై కేసులు పెడుతోందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో లోకేష్ వారికి ధైర్యం చెప్పి టీడీపీ అధికారంలోకి…
అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పలు మండలాలలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తలుపుల మండలం లో 142.2. మిల్లీమీటర్ల నమోదు కావడంతో తలుపుల మండలంలోని చిన్నపల్లి, మాడిక వాండ్లపల్లి చెరువులకు గండి పడి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చిన్నపల్లి చెరువు తెగిపోవడంతో ఓదులపల్లి వద్ద వర్షపు నీటి ప్రవాహానికి కదిరి పులివెందుల ప్రధాన రహదారిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తలుపుల మండలం గొల్లపల్లి వద్ద కదిరి నుంచి విజయవాడ…
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ రాయలసీమలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 8, 9వ తేదీల్లో సీఎం పర్యటన ఉంటుంది. జూలై 8న ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరతారు. పది గంటల ప్రాంతంలో పుట్టపర్తిలో విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా రాయదుర్గం చేరుకుని ఉదేగోలం గ్రామంలో రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. వైఎస్సార్ ఆర్బీకే ప్రారంభించటంతో పాటు వ్యవసాయ అధికారులు, సిబ్బందితో ఇంటరాక్ట్ అవుతారు.…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కట్టడి కోసం కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగనుంది.. ఈ నెల 5వ తేదీన ఏపీలో కర్ఫ్యూ ప్రారంభించగా.. కొత్త కేసులు కంట్రోల్ కాకపోవడంతో.. కర్ఫ్యూను మరింత టైట్ గా అమలు చేస్తున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కేసుల తీవ్రతను బట్టి లాక్‌డౌన్ కూడా అమలు చేస్తున్నారు.. తాజాగా, కరోనా కేసుల కట్టడికి అనంతపురం జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది……