Tadipatri CI Phone Audio Viral: రాజకీయాల్లో ఎప్పుడూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా ఉంటుంది.. అయతే, ఇప్పుడు జేసీ వ్యవహారంలో తాడిపత్రి అర్బన్ సీఐ, ఓ వ్యక్తి మధ్య సాగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. వేరేవాళ్లతో ఫోన్ చేయించి జేసీ ప్రభాకర్‌రెడ్డి తనను బెదిరిస్తున్నాడన్న రాంపులయ్య అనే వ్యక్తి.. తనకు జేసీ ఫోన్ నంబర్ కావాలంటూ సీఐ సాయిప్రసాద్‌ను అడగడంతో.. ఇద్దరి మధ్య మాటామాట పెరిగిపోయింది.. చివరకు అసభ్యపదజాలంతో దూషించుకోవడం వరకు వెళ్లింది..
Read Also: KTR-ED: ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్ కార్యకర్తలు అరెస్ట్!
అయితే, ఇప్పుడు అనంతపుంర జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది తాడిపత్రి అర్బన్ సీఐ సాయిప్రసాద్ ఆడియో.. తాడిపత్రికి చెందిన రాం పుల్లయ్య అనే వ్యక్తి… తాడిపత్రి అర్బన్ సీఐ సాయి ప్రసాద్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో వైరల్ అవుతోంది.. తనను వేరే వాళ్లతో ఫోన్ చేయించి జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరిస్తున్నాడని… జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ నంబర్ కావాలని.. సీఐ సాయిప్రసాద్ ని అడిగారు రాం పుల్లయ్య.. అయితే, నేను నీ కింద సర్వెంట్ ను కాదు.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ నంబర్ నేనెందుకు ఇవ్వాలంటూ రాం పుల్లయ్యను గద్దించారు సీఐ.. దీంతో రాంపుల్లయ్య కూడా రెచ్చిపోయారు.. దీంతో.. సీఐ, రాంపులయ్య మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.. ఒకరినొకరు బూతులు తిట్టుకున్నారు రాం పుల్లయ్య, సీఐ సాయి ప్రసాద్.. అక్కడితో ఆకుండా లైవ్ లొకేషన్ పెట్టు.. అక్కడికే వస్తా.. అక్కడే తేల్చుకుంటాను అంటూ.. ఇద్దరి మధ్య సవాళ్ల పర్వం కూడా సాగింది.. మొత్తానికి సీఐ సాయి ప్రసాద్.. రాంపుల్లయ్య మధ్య జరిగిన సంభాషణ ఆడియో వైరల్ అవ్వడంతో.. విచారణకు ఆదేశించారు జిల్లా ఎస్పీ జగదీష్..