Amul Milk Prices: గుజరాత్‌కు చెందిన పాల కంపెనీ అమూల్ పాల ధరలను మరోసారి పెంచింది. 'అమూల్' బ్రాండ్‌తో పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) అన్ని రకాల ఉత్పత్తుల ధరలను రూ.2 పెంచినట్లు ప్రకటించింది.
చిత్తూరు డైయిరీని అమూల్ కు ధారాదత్తం చేయడం సరికాదంటూ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. చిత్తూరు డెయిరీని అమూల్ కు అప్పగించడమంటే తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే.. ఇక్కడి ప్రజాసంపద, సహకార డైయిరీల వేలకోట్ల విలువైన ఆస్తులను అమూల్ కు కట్టబెట్టడతారా..? అని ప్రశ్నించారు.
Amul: కర్ణాటక, తమిళనాడు తర్వాత ఇప్పుడు అమూల్ పాలపై పోరాటం మహారాష్ట్రకు చేరింది. రాష్ట్రంలోని పాల ఉత్పత్తిదారుల సంఘాలు తమ ఉనికిని కాపాడుకునేందుకు అమూల్‌కు వ్యతిరేకంగా నిలబడాలని మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ విజ్ఞప్తి చేశారు.
Amul hikes price of milk by Rs 2 per litre: పండగ సీజన్ ముందు సామాన్యులకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది ప్రముఖ పాల ఉత్పత్తి సంస్థ అమూల్. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటి్ంగ్ ఫెడరేషన్ లిమిటెడ్ అమూల్ బ్రాండు పేరుతో దేశవ్యాప్తంగా పాలను విక్రయిస్తోంది. ప్రస్తుం ఈ సంస్థ లీటర్ పాల ధరను రూ.2 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫుల్ క్రీమ్ మిల్క్ ధర లీటర్ కు రూ. 61 నుంచి 63కు పెరగనుంది.…
Milk Prices Hiked Again: దేశవ్యాప్తంగా మరోసారి పాలధరలు పెరిగాయి. గత నెలలో జీఎస్టీ కారణంగా పెరిగిన పాలధరలు ప్రస్తుతం మరోసారి సామాన్యులకు భారంగా తయారయ్యాయి. పాల సేకరణ, ఇతర వ్యయాలు పెరిగిపోవడంతో పాల ధరలను పెంచుతున్నట్లు అమూల్, మదర్ డైరీలు వేర్వేరుగా ప్రకటించాయి. అమూల్ గోల్డ్, అమూల్ తాజా, అమూల్ శక్తి పాల ధరలను లీటరుకు రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) తెలియజేసింది. కొత్త ధరలు బుధవారం…
అమూల్ సంస్థ పాల ధరలను మరోసారి పెంచింది. తన అన్ని రకాల పాల ధరలను పెంచుతున్నామని సోమవారం ప్రకటించింది. లీటర్ పాలపై రూ.4 పెంచుతున్నట్లు వెల్లడించింది. పెంచిన ధరలను మార్చి 1 నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపింది. అమూల్ సంస్థ గోల్డ్, తాజా, శక్తి, టీ స్పెషల్ లాంటి వేరియంట్లలో పాల ప్యాకెట్లను ఉత్పత్తి చేస్తోంది. అమూల్ గోల్డ్ అరలీటర్ ప్యాకెట్ ప్రస్తుతం రూ.28గా ఉండగా మార్చి 1 నుంచి రూ.30కి పెరగనుంది. మరోవైపు అమూల్ తాజా…
నేడు కృష్ణా జిల్లాలో జగనన్న పాలవెల్లువ పథకాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరల స్థిరీకరణతో ప్రభుత్వం మార్కెట్లోకి ప్రవేశించి రైతులకు మంచి ధరలు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందన్నారు. దీనివల్ల వ్యాపారులు కూడా మంచి ధరలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని, నిర్ణయించిన ధరకు లేక అంతకన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ధరల స్థిరీకరణ నిధిద్వారా రైతులకు తోడుగా నిలవగలిగామని ఆయన వెల్లడించారు.…
అంగన్‌వాడీ కేంద్రాలకు అమూల్ పాలను అందించేందుకు ఏపీ డెయిరీ ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం32,59,042 మందికి ప్రభుత్వం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల ద్వారా పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తుంది. వీరిలో 3,24,378 మంది గర్భిణులు, 2,23,085 మంది బాలింతలు, 15,64, 445 మంది మూడేళ్లలోపు చిన్నారులు, 11,47,134 మంది మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. తల్లీ బిడ్డలకు ప్రతినెలా పాల ప్యాకెట్లను ప్రస్తుతం…
అమూల్ వినియోగదారులకు చేదు వార్త వినిపించింది… అమూల్‌కు చెందిన అన్ని రకాల పాల బ్రాండ్లపై లీటర్‌కు రూ.2 చెప్పున పెంచేసింది… పెరిగిన ధరలు రేపటి నుంచి అంటే జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.. అన్ని బ్రాండ్లపై పాలపై లీటర్‌కు రూ. 2 చొప్పున పెంచినట్టు గుజరాత్ సహకార మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) అధికారి ప్రకటించారు.. అయితే, ఉత్పత్తి వ్యయం పెరడమే ధరల పెరుగుదలకు కారణమని.. ఏడాదిన్నర తర్వాత పాల ధరలను పెంచాల్సి వచ్చిందని…