నేడు కృష్ణా జిల్లాలో జగనన్న పాలవెల్లువ పథకాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరల స్థిరీకరణతో ప్రభుత్వం మార్కెట్లోకి ప్రవేశించి రైతులకు మంచి ధరలు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందన్నారు. దీనివల్ల వ్యాపారులు కూడా మంచి ధరలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని, నిర్ణయించిన ధరకు లేక అంతకన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ధరల స్థిరీకరణ నిధిద్వారా రైతులకు తోడుగా నిలవగలిగామని ఆయన వెల్లడించారు.
అమూల్ అనేది కంపెనీ కాదు.. సహకార సంస్థ. రైతులే యజమానులు. అమూల్ దగ్గర మంచి ప్రాససింగ్ యూనిట్లు ఉన్నాయి. వచ్చే లాభాలను పాడిరైతులకే తిరిగి ఇస్తారు. అమూల్ లాభాపేక్ష లేని సంస్థ. సేకరించిన పాల సేకరణవల్ల రైతులకు అదనంగా రూ.10 కోట్ల రూపాయల మేలు జరిగింది అని జగన్ తెలిపారు. రైతులకు అదనంగా లీటర్‌కు రూ.20ల పైచిలుకు లాభం వచ్చిందని ఆయన అన్నారు.