కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్-బీజేపీలు విమర్శల జోరు పెంచాయి. బాగల్ కోట్ లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలతో విరుచుకుపడ్డారు.
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వంశపారంపర్య రాజకీయాలు తారాస్థాయికి చేరుకుంటాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాగల్ కోట్ జిల్లాలోని తెరాల్ లో జరిగిన బహిరంగ సభకు అమిత్ షా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అమిత్ షా కామెంట్స్ చేశాడు..
ఖమ్మం జిల్లా కల్లూరులో బీఅర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో వైద్య,ఆరోగ్య,ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రసంగించారు. బీజేపీ వాళ్లు తెలంగాణలో గెలుస్తాం అని మాట్లాడుతున్నారని.. కానీ ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు కాదు కదా.. డిపాజిట్ కూడా రాదన్నారు. జిల్లాలో డిపాజిట్ రాని పార్టీ రాష్ట్రం లో అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నించారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన హామీపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. వెనుకబడిన ముస్లింలను చేరదీయాలని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతుండగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వారి రిజర్వేషన్లను తొలగిస్తామని హామీ ఇస్తున్నారని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
రాష్ట్రంలో అమిత్ షా టూర్ సక్సెస్ అయిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి తరుణు చుగ్ అన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని వేల మంది బీజేపీ కార్యకర్తల్లో, రాష్ట్ర ప్రజల్లో బాగా జోష్ వచ్చిందని ఆయన అన్నారు.
Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం హైదరాబాదులో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ఆర్ఆర్ఆర్ టీంలో హోం మంత్రి భేటీ రద్దయింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో ఎమర్జెన్సీ మీటింగ్ ఉండడంతో మంత్రి పర్యటనలో మార్పులు జరిగినట్లు తెలుస్తోంది.