Amit Shah: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. విదేశాలకు వెళ్లి సొంతదేశాలను విమర్శించడం ఏ పార్టీ అధినేతకు కూడా తగదని రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. భారత్‌పై దుష్ప్రచారం చేయడానికే రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లారని ఆరోపించిన అమిత్ షా.. తన పూర్వీకుల నుంచి నేర్చుకోవాలని సూచించారు.
Read Also: Mobile Gaming: కొంపముంచిన “ఫ్రీ ఫైర్”.. తల్లి అకౌంట్ నుంచి రూ.36 లక్షలు ఖాళీ.. హైదరాబాద్‌లో ఘటన
మోదీ ప్రభుత్వానికి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం గుజరాత్ లోని పటాన్ జిల్లా సిద్ధ్ పూర్ పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఇటీవల అమెరికా పర్యటనలో నరేంద్రమోడీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలను అమిత్ షా ప్రస్తావించారు. దేశభక్తి ఉన్నవారెవరైనా భారత రాజకీయాలను భారతదేశంలోనే చర్చించాలని, విదేశాలకు వెళ్లి దేశ రాజకీయాలపై చర్చించి దేశాన్ని అవమానపరచడం ఎవరికి తగదని, ఈ విషయాన్ని రాహుల్ బాబా గుర్తుంచుకోవాలని అమిత్ షా అన్నారు. దేశ ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ భారత్ వ్యతిరేక వ్యతిరేక విషయాల గురించి మాట్లాడటం మానేయదు, రాహుల్ బాబా వేసవి వేడి కారణంగా విదేశాలకు వెళ్తున్నారు, అతను విదేశాల్లో దేశాన్ని విమర్శిస్తున్నారు. అంతకుముందు రాహుల్ గాంధీ విమర్శలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా విమర్శలు చేశారు. విదేశాలకు వెళ్లి భారత దేశాన్ని తిట్టడం రాహుల్ గాంధీకి అలవాటే అని అన్నారు. దేశంలో రాజకీయాలు చేయాలి కానీ.. విదేశాలకు వెళ్లి ఇలా ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటని ప్రశ్నించారు.