Pahalgam terror attack: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకపు టూరిస్టులను ఉగ్రవాదులు పొట్టనుపెట్టుకున్నారు. కాశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన వారిని, మతం అడిగి హిందువులు అయితే కాల్చి చంపారు. ఈ ఘటనకు పాల్పడింది తామే అని పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరేతోయిబాకు చెందిన టీఆర్ఎఫ్ ప్రకటించింది.
దక్షిణ కశ్మీర్‌లోని పహల్గామ్లోని బైసారన్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. ఈ ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. దాడి తర్వాత భారతదేశం కఠిన చర్యలు తీసుకుంది. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడంతో సహా అనేక ఆంక్షలు విధించింది. భారతదేశం తీసుకున్న పెద్ద నిర్ణయాల తర్వాత.. పాకిస్థాన్ కూడా నిరంతరం బెదిరింపులు జారీ చేస్తోంది. బయటకు హెచ్చరికలు చేసినా.. నిజానికి పాకిస్థాన్ లోలోపల వణుకుతోంది.…
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత గురువారం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆధ్వర్యంలో ఈ ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది.
Ceasefire: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్‌పై దౌత్య చర్యలు తీసుకుంటున్న భారత్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Indian Airlines: పహల్గామ్ ఉగ్ర దాడి భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను పెంచింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రం కూడా ఇప్పటికే దౌత్య చర్యల్ని మొదలుపెట్టింది. ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు, పాకిస్థానీలకు వీసాల రద్దు, సరిహద్దు మూసివేత వంటి నిర్ణయాలను ప్రకటించింది. అయితే, దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ కూడా భారత్‌తో వాణిజ్యం రద్దు చేయడంతో పాటు అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపేసినట్లు ప్రకటించింది.…
Midhun Reddy: ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష పార్టీకి హాజరైన వైసీపీ లోకసభ పక్ష నేత మిథున్ రెడ్డి ఉగ్రవాదులపై చర్యలపై మాట్లాడారు. ఉగ్రవాదుల అణిచివేతకు తీసుకునే అన్ని చర్యలకు మా మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని, కాశ్మీర్ లో అశాంతి నెలకొల్పే శక్తులను అణిచివేయాలని ఆయన అన్నారు. సరైన సమయంలో అన్ని చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని ఈ సందర్బంగా ఆయన చెప్పుకొచ్చారు. కాశ్మీర్…
Asaduddin Owaisi: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దేశ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నామనే సందేశాన్ని పంపడానికి శుక్రవారం ప్రార్థనలకు వెళ్లేటప్పుడు ముస్లింలు తమ్ చేతులకు నల్ల బ్యాండ్ ధరించాలని విజ్ఞప్తి చేశారు.
Indian Air Force: భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘టీఆర్ఎఫ్’’ ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది టూరిస్టుల మరణించారు. దీంతో ప్రజలు పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Amit Shah: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది మరణించారు. ఈ దాడిపై యావత్ దేశం తన ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్‌కి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఈ ఉగ్రవాద దాడి గురించి గురువారం వీరిద్దరు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతికి వివరించారు. Read Also: Surya…
Pahalgam Terror Attack: పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ తన చర్యల్ని వేగవంతం చేసింది. పాకిస్తాన్ తీరును ఎండగట్టడానికి, టెర్రరిస్టుల దాడి గురించి వివరించడానికి ప్రపంచ దౌత్యవేత్తలకు పిలుపునిచ్చింది. ఇప్పటికే, భారత్ ఉగ్రదాడి గురించి అమెరికా, యూరోపియన్ దేశాలకు చెందిన సీనియర్ దౌత్యవేత్తలకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ సమావేశానికి జపాన్, ఖతార్, చైనా, కెనడా మరియు రష్యా నుండి దౌత్యవేత్తలు కూడా హాజరయ్యారు.