CM Chandrababu: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపుతున్నారు.. వరుసగా కేంద్రమంత్రులతో సమావేశం అవుతూ వస్తున్నారు.. ఇక, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.. అమిత్‌షాతో విడిగా కూడా ప్రత్యేక చర్చలు జరిపారు ఏపీ ముఖ్యమంత్రి.. గంటన్నర పాటు అమిత్ షా – చంద్రబాబు సమావేశం సాగింది.. ఇటీవల కేంద్రం చేసిన నూతన “నేర చట్టాలు” అమలుపై చర్చించారు.. ఆ తర్వాత, అమిత్ షాతో విడిగా ప్రత్యేకంగా సమావేశమయ్యారు చంద్రబాబు.. ఈ ప్రత్యేక భేటీలో రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో నెలకున్న రాజకీయ పరిస్థితులను అమిత్ షాకు వివరించినట్టుగా తెలుస్తోంది.. కాగా, రాష్ట్రంలో వివిధ కేసులు, అరెస్ట్‌లు హాట్ టాపిక్‌గా మారగా.. ఈ సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది..
Read Also: Gautam Gambhir: 2027 వరల్డ్ కప్ వరకు కష్టమే.. ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన గంభీర్..!