రష్యా-ఉక్రెయిన్ మధ్య రెండేళ్లకు పైగా యుద్ధం సాగుతోంది. ఇప్పటికీ రెండు దేశాల మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. రష్యా జరిపిన భీకరదాడుల్లో ఉక్రెయిన్ చాలా నష్టపోయింది. తాజాగా ఉక్రెయిన్ కూడా అంతే ధీటుగా దాడులను ఎదుర్కొంటోంది.
Los Angeles Wildfires: లాస్ ఏంజెలెస్‌లో గల హాలీవుడ్‌లోని ఐకానిక్ నిర్మాణాలను కార్చిచ్చు కాల్చి బూడిద చేసే ప్రమాదం ఉంది. ఆస్కార్ అవార్డులు ప్రదానం చేసే ప్రఖ్యాత డాల్బీ థియేటర్‌ను కూడా అగ్నిమాపక శాఖ అధికారులు ఖాళీ చేయించారు. దీంతో ప్రస్తుతం పరిస్థితితో ఆస్కార్ నామినేషన్ ప్రక్రియ ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది.
America: గౌతమ్ అదానీతో పాటు ఆయన కంపెనీలపై విచారణ చేయాలని ఇటీవల అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముడుపుల చెల్లింపు కేసులో అమెరికా న్యాయస్థానం అదానీని నిలదీసింది. అయితే, భారతీయ వ్యాపారిపై అమెరికా కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని రిపబ్లికన్ నేత తీవ్రంగా ఖండించారు.
Fire Explodes: అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ను కార్చిచ్చు చుట్టుముట్టింది. దీంతో వేలాది ఎకరాల్లోని విలాసవంతమైన ఇండ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇక్కడ సంపన్న వర్గాలు నివసించే ది పాలిసాడ్స్ ఏరియాలో కార్చిచ్చు చెలరేగినట్లు సమాచారం.
ట్రూడో తాజాగా స్పందించారు. కెనడా అమెరికాలో భాగమయ్యే అవకాశమే లేదని ఎక్స్ వేదికగా వెల్లడించారు. రెండు దేశాలలోని కార్మికులు, వాణిజ్యం, భద్రతా భాగస్వామ్యం ద్వారా ప్రజలు లాభపడుతున్నారని అతడు తెలిపాడు.
డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. హమాస్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.. తాను అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు చేపట్టకముందే హమాస్ చెరలో ఉన్న బందీలను రిలీజ్ చేయాలి.. అలా జరగకపోతే మిలిటెంట్ గ్రూప్ హమాస్‌కు నరకం చూపిస్తానని అతడు హెచ్చరించారు.
North Korea: దక్షిణ కొరియా, జపాన్‌లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ పర్యటిస్తున్న సందర్భంగా ఉత్తర కొరియా హైపర్ సోనిక్ క్షిపణిని పరీక్షించింది. దీంతో పసిఫిక్ సముద్రంలో ఉన్న ఏ శత్రువునైనా నమ్మకంగా ఈ మిస్సైల్ ఎదుర్కోగలదని నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ తన చివరి సమయంలో తీసుకుంటున్న అధికారిక నిర్ణయాలతో పరిపాలనను, అధికార బదిలీని కష్టతరం చేస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.
Donald Trump: కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో రాజీనామా చేసిన కొన్ని గంటలకే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కెనడాను యునైటెడ్ స్టేట్స్ లో 51వ రాష్ట్రంగా విలీనం చేసే ప్రతిపాదనను పునరుద్ధరిస్తామని చెప్పుకొచ్చారు.