Suchir Balaji: అమెరికా పోలీసులు సంచలన నిర్ణయం.. సుచిర్ బాలాజీ కేసు మూసివేత
- అమెరికా పోలీసులు సంచలన నిర్ణయం
- సుచిర్ బాలాజీ కేసు మూసివేత
- హత్యేనంటూ తల్లిదండ్రుల ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాట్‌జీపీటీ సంస్థ ‘ఓపెన్ ఏఐ’ మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ (26) కేసును అమెరికా పోలీసులు క్లోజ్ చేశారు. సుచిర్ బాలాజీది హత్య కాదని.. ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తేల్చారు. ఈ మేరకు పోస్టుమార్టం రిపోర్టులో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. దీంతో అనేక వారాల దర్యాప్తు తర్వాత పోలీసులు కేసును మూసివేస్తున్నట్లు వెల్లడించారు. హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.
ఇది కూడా చదవండి: NTR – Neel : సలార్, కేజీఎఫ్ రూట్ లోనే ఎన్టీఆర్ – నీల్ సినిమా.?
Also Read
- Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
- Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
2024, నవంబర్ 26న అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో తన అపార్ట్‌మెంట్‌లో బాలాజీ విగతజీవిగా పడి ఉన్నాడు. హఠాత్తుగా బాలాజీ ప్రాణాలు కోల్పోవడం టెక్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేసింది. అయితే పోలీసులు.. బాలాజీ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తేల్చి చేతులు దులుపుకున్నారు. బాలాజీ తల్లిదండ్రులు మాత్రం.. తన కుమారుడిది ముమ్మాటికీ హత్యేనని.. నిగ్గు తేల్చాలని భారత విదేశాంగ శాఖను, అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఎలోన్ మస్క్ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక విజ్ఞప్తి చేసి.. బాలాజీ మరణంపై దర్యాప్తు చేయాలని కోరారు. మొత్తానికి కొన్ని వారాలు తర్వాత ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్లుగా శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Gold Price: మరోమారు దూకుడు చూపిస్తున్న బంగారం ధరలు..
సుచిర్ బాలాజీ.. నాలుగేళ్ల పాటు ఓపెన్ ఏఐలో పరిశోధకుడిగా పనిచేశారు. గత ఆగస్టులో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ సందర్భంగా ఓపెన్ ఏఐతో లాభం కంటే.. హానికరమే ఎక్కువ అని పేర్కొ్న్నారు. అంతేకాకుండా చాట్‌జీపీటీ కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. వ్యక్తుల, వ్యాపార సంస్థల రాబడి అవకాశాలను చాట్‌జీపీటీ, ఇతర చాట్‌బాట్‌లు ధ్వంసం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇక 2022లో కాపీరైట్ ఉల్లంఘనలకు సంబంధించి అనేక పిటిషన్లు ‘ఓపెన్‌ఏఐ’పై దాఖలయ్యాయి. ఈ కేసుల్లో బాలాజీ సాక్ష్యం కీలకం కానున్న నేపథ్యంలో అతడి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర అనుమానాలకు తావిచ్చింది.
SFPD writes inaccurate information in
Autopsy and Police report . They have never retrieved CCTV footage from leasing office . We need report from police.
We are only requesting transparent investigation.@elonmusk @kash_patel @MarioNawfal— Poornima Rao (@RaoPoornima) February 15, 2025
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?