Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Kash Patel Appointed As Fbi Director

Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. భారత సంతతి వ్యక్తికి కీలక పోస్టు

Published Date :February 21, 2025 , 8:52 am
By Suresh Maddala
  • ట్రంప్ మరో సంచలన నిర్ణయం
  • భారత సంతతి వ్యక్తికి కీలక పోస్టు
Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. భారత సంతతి వ్యక్తికి కీలక పోస్టు
  • Follow Us :
  • google news
  • dailyhunt

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత సంతతికి చెందిన కాష్ పటేల్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కాష్ పటేల్‌ నియామకానికి సంబంధించిన తీర్మానానికి సెనెట్ ఆమోదం తెలిపింది. 51-49 ఓట్ల తేడాతో ఈ తీర్మానం ఆమోదం పొందింది. ఎఫ్‌బీఐ తొమ్మిదవ డైరెక్టర్‌గా కాష్ పటేల్‌ను నియమిస్తూ ట్రంప్ అధికారికంగా సంతకం చేశారని అధ్యక్షుడి సహాయకుడు, వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొత్త ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ నియామకాన్ని వైట్ హౌస్ స్వాగతించినట్లు తెలిపారు. ట్రంప్ ఎజెండాను అమలు చేయడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించింది.

ఇది కూడా చదవండి: KCR: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు..

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ పేరును ప్రకటించారు. అయితే ఇలాంటి పదవుల విషయంలో సెనెట్‌ ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనిపై తీర్మానంపై సెనెట్‌లో ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్‌లో కాష్‌ పటేల్‌కు అనుకూలంగా 51, వ్యతిరేకంగా 49 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన నియామకం అధికారికంగా ఆమోదముద్ర పడింది. అయితే రిపబ్లికన్‌లకు మెజార్టీ ఉన్న సెనేట్‌లో కాష్ పటేల్ నియమాకంపై ఓటింగ్ చేపట్టారు. అయితే అనూహ్యంగా ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు పార్టీ విప్ ధిక్కరించి ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు. ఇక ప్రతిపక్ష డెమోక్రాట్లు కూడా పటేల్‌ నియమాకంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం రెండు ఓట్ల తేడాతో పటేల్ నియామకానికి లైన్‌ క్లియర్‌ అయింది.

ఇది కూడా చదవండి: Taj Banjara Hotel: బంజారాహిల్స్‌ లోని తాజ్‌ బంజారా హోటల్‌ సీజ్..

కాష్ పటేల్ బ్యాగ్రౌండ్ ఇదే
1980లో న్యాయార్క్‌లోని గుజరాతీ తల్లిదండ్రులకు కాష్ పటేల్ జన్మించారు. తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. లాంగ్ ఐలాండ్‌లోని గార్డెన్ సిటీ హైస్కూల్ నుంచి పట్టభద్రుడయ్యాడు. రిచ్‌మండ్ విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ అధ్యయనాలు పూర్తి చేశారు. యూనివర్శిటీ కాలేజ్ లండన్‌ నుంచి ఇంటర్నేషనల్ లా అభ్యసించారు. గతంలో జాతీయ భద్రతా సలహాదారుగా, హౌస్ పర్మనెంట్ సెలెక్ట్ కమిటీ ఆన్ ఇంటెలిజెన్స్‌కి సీనియర్ కౌన్సెల్‌గా కూడా పటేల్ పని చేశారు.

ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియామకం తర్వాత కాష్‌ పటేల్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ‘‘అమెరికా ప్రజలు గర్వించేలా ఎఫ్‌బీఐని తీర్చిదిద్దుతాను. అమెరికన్లకు హాని చేయాలని చూస్తే వారి అంతు చూస్తాం. వారు ఈ గ్రహంలో ఏ మూలన ఉన్నా వెంటాడుతామని హెచ్చరించారు. డైరెక్టర్‌గా నా లక్ష్యం స్పష్టంగా ఉంది.’’ అని పటేల్ తెలిపారు.

Moments ago in the Oval Office.

Congratulations to the Ninth Director of the Federal Bureau of Investigation, Kash Patel.

President Trump has officially signed the commission…

Follow Kash on his new 𝕏 account: @FBIDirectorKash. pic.twitter.com/qcRqxE20d1

— Dan Scavino (@Scavino47) February 21, 2025

🇺🇸 @FBIDirectorKash Patel's confirmation as FBI Director is a crucial step in executing President Trump’s agenda to restore integrity and uphold the rule of law.

The FBI will serve the American people and refocus on its core mission: enforcing justice fairly and without bias. pic.twitter.com/LoxYtx14VR

— The White House (@WhiteHouse) February 20, 2025

I am honored to be confirmed as the ninth Director of the Federal Bureau of Investigation.

Thank you to President Trump and Attorney General Bondi for your unwavering confidence and support.

The FBI has a storied legacy—from the “G-Men” to safeguarding our nation in the wake of…

— FBI Director Kash Patel (@FBIDirectorKash) February 20, 2025

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • america
  • FBI director
  • Kash Patel appointed
  • us

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : మేం దాడులు చేస్తే శత్రువులు బెంబెలెత్తిపోవాల్సిందే.. అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ వార్నింగ్!

  • Israel: ‘‘ప్రభుత్వాన్ని పడగొట్టండి’’.. ఇరాన్ ప్రజలకు నెతన్యాహూ పిలుపు..

  • Pakistan: “భారత్‌తో పోటీ పడేంత సీన్ లేదు”.. సొంత టీమ్‌పై పాకిస్థాన్ మాజీ ప్లేయర్స్ ఫైర్..

  • Pakistan: పాకిస్తాన్‌‌‌కు అంటుకున్న “ఇరాన్” మంటలు.. యూఎస్ కాల్పుల్లో 12 మంది మృతి..

  • Israel-Iran War: ఇరాన్‌పై ఇజ్రాయిల్ భీకర దాడులు, టెహ్రాన్‌పై బాంబుల వర్షం..

  • Saraswathi : వరలక్ష్మి ‘సరస్వతి’కి బాలయ్య సపోర్ట్..

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions