డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపారు. మెక్సికో సరిహద్దులో సైన్యాన్ని దింపి అక్రమ వలసలకు అడ్డుకట్ట వేశారు. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన అనేక దేశాల ప్రజలను పట్టుకుని తిరిగి పంపించేశారు. ఇందులో భారత పౌరులను కూడా తిరిగి పంపించేసింది.
వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. అమెరికా ఉత్పత్తులపై భారత్ 100 శాతం సుంకాలు విధిస్తుందన్నారు. ఇతర దేశాలు విధించే అధిక సుంకాలతో యూఎస్ ఉత్పత్తులను ఎగుమతి చేయడం అసాధ్యంగా మారిందన్నారు. అందుకే వాటిపై ప్రతీకార సుంకాలు విధించడానికి ఇదే సరైన సమయమని వెల్లడించింది.
ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ వాతావరణం ముసురుతోంది. తమతో అణు ఒప్పందం చేసుకోకపోతే భయంకరమైన బాంబు దాడులు జరుగుతాయని ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు.
అగ్ర రాజ్యం అమెరికాలో ఎవరైనా రెండు సార్లు మాత్రమే అధ్యక్షుడిగా పని చేసే అవకాశం ఉంటుంది. మూడోసారి చేసే అవకాశం ఉండదు. రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం.. ఏ వ్యక్తి కూడా రెండుసార్లు కంటే ఎక్కువ అధ్యక్ష పదవికి ఎన్నిక కాకూడదు. కానీ తాజాగా డొనాల్డ్ ట్రంప్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. నిన్నామొన్నటి దాకా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై గరం గరంగా ఉన్న ట్రంప్.. ఇప్పుడు డైరెక్షన్ మారింది. తాజాగా పుతిన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అణు ఒప్పందంపై ఇరాన్-అమెరికా మధ్య వార్ ముదురుతోంది. అణు ఒప్పందం చేసుకోవాలంటూ అమెరికా ఒత్తిడి తెస్తుంటే.. ప్రసక్తేలేదంటూ ఇరాన్ తోసిపుచ్చుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు.
ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా సైట్ ‘ఎక్స్’ను తన సొంత xAI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీకి 33 బిలియన్ డాలర్ల ఆల్ స్టాక్ డీల్‌లో విక్రయించినట్లు మస్క్ బిలియనీర్ ప్రకటించారు. ఎక్స్ఏఐ విలువను 80 బిలియన్ డాలర్లుగా నిర్ధారించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వైట్‌హౌస్‌లో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముస్లింలతో కలిసి ట్రంప్ విందు చేశారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో ఓట్లు వేసినందుకు ముస్లింలకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు.
అమెరికాతో పాత సంబంధం ముగిసిందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తెలిపారు. కెనడాపై అమెరికా అధిక సుంకాలను విధించిన నేపథ్యంలో కార్నీ ఈ విధంగా స్పందించారు. అమెరికాతో ఆర్థిక, భద్రతా, సైనిక సంబంధాలు మొత్తం ముగిసినట్లుగా పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియపై భారీ మార్పులు చేస్తూ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇకపై ఓటరు నమోదు కోసం పౌరసత్వానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని తప్పనిసరి చేశారు. అంతేకాకుండా అమెరికాయేతర పౌరులు విరాళం ఇవ్వకుండా నిషేధం విధించింది.