Allu Arjun : తెలుగువారంటే వైల్డ్ ఫైర్.. అల్లు అర్జున్ మాస్ స్పీచ్..
- తెలుగు కల్చర్ ఎంతో గొప్పది
- బన్నీ పుష్ప డైలాగులు
- సుకుమార్ కామెంట్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun : అల్లు అర్జున్, సుకుమార్, రాఘవేంద్ర రావు, శ్రీలీల అమెరికాలో నిర్వహించిన నాట్స్ ప్రోగ్రామ్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. అమెరికాలో ఇంత మంది తెలుగు వాళ్లం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి ప్రోగ్రామ్ కు నన్ను పిలిచినందుకు మీ అందరికీ థాంక్స్. తెలుగు వారంటే ఫైర్ అనుకున్నావా వైల్డ్ ఫైర్. అదే ఇప్పుడు అమెరికాలో కనిపిస్తుంది. నాట్స్ గురించి ఓ మాట చెబుతా. నాట్స్ అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్ నేషనల్. మన తెలుగు కల్చర్ ను ముందు తరాలకు తీసుకెళ్తున్న నాట్స్ కు చాలా స్పెషల్ థాంక్స్ చెబుతున్నా. ఎక్కడున్నా సరే ఇండియన్స్ తగ్గేదేలే.. తెలుగు వారు అస్సలు తగ్గేదే లే అంటూ హుషారెత్తించాడు బన్నీ.
Read Also : Dilraju : విజయ్ ను చూసి మిగతా హీరోలు నేర్చుకోవాలి.. దిల్ రాజు కామెంట్స్..
Also Read
డైరెక్టర్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు అవుతోంది. ఇక్కడ నేను పరిచయం చేసిన అల్లు అర్జున్, శ్రీలీల ఉండటం చాలా సంతోషంగా ఉంది. తెలుగు వారందరినీ అమెరికాలో ఇలా ఒకేచోట చూడటం ఆనందంగా ఉంది. సుకుమార్ కు నాకు ఒకటే తేడా. ఆయనకు గడ్డం ఉంటుంది.. నాకు ఉండదు. నేను అడవిరాముడిలో అడివిని నమ్ముకుని స్టార్ డైరెక్టర్ ను అయ్యాను. ఆయన పుష్పలో అడివిని నమ్ముకుని స్టార్ డైరెక్టర్ అయ్యాడు. బన్నీని స్టార్ ను చేశాడు అంటూ చెప్పాడు రాఘవేంద్రరావు.
సుకుమార్ మాట్లాడుతూ.. అమెరికాలో నా సినిమాలను ఎంతో ఆదరిస్తున్న మీ అందరికీ స్పెషల్ థాంక్స్. వన్ నేనొక్కడినే మూవీని ఇక్కడ చాలా ఆదరించారు. అందువల్లే నాకు వేరే సినిమా ఛాన్స్ వచ్చింది. నవీన్ ఎర్నేనిని మాకు ప్రొడ్యూసర్ గా ఇచ్చినందుకు మీ అందరికీ స్పెషల్ థాంక్స్. మైత్రీ మూవీ మేకర్స్ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ నాట్స్ ప్రోగ్రామ్ కు రావడం ఒక రకంగా గర్వంగా ఉంది. మీ అందరూ ఎప్పుడూ ఇలాగే ఉండాలి అంటూ తెలిపాడు సుకుమార్.
Read Also : Samantha: ఏంటి సమంత.. అలా స్టేజిపై ఏడ్చేశావ్.. అభిమానులు ఏమై పోవాలి..!
తాజావార్తలు
-
Kerala Anchor Case: మహిళలపై ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలు.. డిబేట్ చేసిన టీవీ యాంకర్‌పై కేసు!
-
Vaishnavi: మా ఎపిక్ బోల్డ్ కంటెంటే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు!
-
LIC Yuva Term Plan: సామాన్యులకు సూపర్ స్కీమ్.. రోజుకు రూ.24తో రూ.50 లక్షల ఇన్సూరెన్స్! ఓ లుక్ వేయండి..
-
Israel-Hamas: అక్టోబర్ 7 దాడులకు ముందే నెతన్యాహుకు యూఏఈ హెచ్చరిక.. వెలుగులోకి ఫోన్ సంభాషణ! అసలేం జరిగింది!
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రూ.32లకే కిలో ఉల్లిపాయలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!